
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో, త్వరలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ లో మూడు మోడల్స్ రానున్నాయి. అవి: Vivo X100, Vivo X100 Pro, Vivo X100 Pro+. ఇప్పుడు ఒక లీక్ లో Vivo X100 Pro డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo X100 Pro స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo X100 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Vivo X100 Pro స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లేతో రానుంది. అలాగే ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.
- కెమెరా: Vivo X100 Pro స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ ప్రైమరీ కెమెరా సెన్సర్, 64ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ64బి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉండవచ్చు. ఈ పెరిస్కోప్ లెన్స్ Vivo X100 Pro+ లో ఉన్న దానికి భిన్నంగా ఉంటుందని సమాచారం. మెయిన్ కెమెరాకి తోడుగా ఒక 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుంది.
- చార్జింగ్: Vivo X100 Pro డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
- ఇతర ఫీచర్లు: Vivo X100 Pro స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అలాగే ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి.
- చిప్సెట్: Vivo X100 Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాప్ మోడల్ Vivo X100 Pro+ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుందని తెలుస్తోంది. వివో మరియు శాంసంగ్ కలిసి 200ఎంపి హెచ్పీవీ పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ని Vivo X100 Pro+ కోసం అందించారు.
ఇప్పటి వరకు Vivo X100 సిరీస్ గురించి తెలిసిన వివరాలు ఇవే. రానున్న రోజుల్లో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.











