
ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ OnePlus 12 ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రానున్న OnePlus 12 డివైజ్ తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి OnePlus 12 కి సంబంధించిన 3సీ సర్టిఫికేషన్ వివరాలు, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
OnePlus 12 3C లిస్టింగ్ వివరాలు
- PJD110 అనే మోడల్ నంబర్ తో OnePlus 12 డివైజ్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది.
- ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లిస్ట్ పై కనిపించింది.
- లిస్టింగ్ వివరాలు కాకుండా, టిప్‌స్టర్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే, ఈ డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus 12 లో 2కే ఎల్టీపీవో బీఓఈ ఎక్స్1 ఓఎల్ఈడీ స్క్రీన్, ఒప్పో పీ1 డిస్ప్లే చిప్, బీఓఈ సింగిల్-పిక్సెల్ కాలిబ్రేటింగ్ టెక్నాలజీ, 6.82-ఇంచ్ స్క్రీన్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ ఉంటుంది.
- మెమొరీ: OnePlus 12 డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది.
- ఓఎస్: OnePlus 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్966 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి 3x పెరిస్కోప్ టెలీఫోటో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీ కెమెరా వివరాలు ఇంకా తెలియలేదు.
- బ్యాటరీ: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్ 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.











