Croma లో OPPO Reno 8T పై భారీ డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • క్రోమాలో OPPO Reno 8T పై భారీ డిస్కౌంట్
  • 2023 ఫిబ్రవరి లో లాంచైన OPPO Reno 8T
  • ప్రస్తుతం రూ.12,765 కి పడిపోయిన ధర

OPPO Reno 8T స్మార్ట్‌ఫోన్ ని ఒప్పో సంస్థ 2023 ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం OPPO Reno 8T పై 50 శాతానికి పైగా డిస్కౌంట్ లభిస్తోంది. మీరు గనుక, ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, కచ్చితంగా ఓసారి OPPO Reno 8T కి సంబంధించిన ఆఫర్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ చెక్ చేయండి.

క్రోమాలో OPPO Reno 8T పై భారీ డిస్కౌంట్

OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ Croma లో 67.27 పర్సెంట్ డిస్కౌంట్ కి లభిస్తోంది. అంటే ఫోన్ ఎంఆర్‌పీ విలువ రూ.38,999 పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇకపోతే OPPO Reno 8T డివైజ్ రూ.29,999 తో ఆన్‌లైన్ లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ డివైజ్ డిస్కౌంట్ తర్వాత రూ.12,765 కి లభిస్తోంది. అంటే ఒక లో-బడ్జెట్ ఫోన్ ధరలో మిడ్-రేంజ్ OPPO Reno 8T కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.

OPPO Reno 8T పై ఫ్లాట్ డిస్కౌంట్ కాకుండా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. OPPO Reno 8T డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. సన్‌రైజ్ గోల్డ్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో OPPO Reno 8T లభించనుంది. సరే, ఓసారి OPPO Reno 8T డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 8T స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • చిప్సెట్: OPPO Reno 8T 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు.
  • బ్యాటరీ, చార్జింగ్: OPPO Reno 8T 5G లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OPPO Reno 8T 5G ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి 40ఎక్స్ జూమ్ మైక్రో-లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: OPPO Reno 8T 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
Previous article3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై లిస్టైన OnePlus 12
Next article5,000mAh బ్యాటరీ, Helio G85 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన POCO C65
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.