
OnePlus సంస్థ నుంచి ఆగస్టులో కొన్ని స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. వన్‌ప్లస్ నుంచి రాబోవు తదుపరి ఫ్లాగ్షిప్ గురించి చాలా బజ్ క్రియేట్ అయ్యింది. అయితే OnePlus 12 లాంచ్ అయ్యేందుకు ఇంకా సమయం చాలానే ఉంది. ఇదిలా ఉండగా, తాజాగా OnePlus 12R కి సంబంధించిన ఓ లీక్ బయటకు వచ్చింది. ఈ లీక్ ద్వారా OnePlus 12R స్పెసిఫికేషన్స్, రెండర్స్, లాంచ్ టైమ్‌లైన్ బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
లీకైన OnePlus 12R రెండర్స్
OnLeaks సౌజన్యంతో MySmartPrice వెబ్ సైట్ షేర్ చేసిన రెండర్స్ ద్వారా OnePlus 12R డిజైన్ బయటకు వచ్చింది. ఇక రెండర్స్ ని గమనిస్తే, OnePlus 12R బెజెల్-లెస్ డిస్ప్లే, తెలుపు రంగు, కర్వ్డ్ డిస్ప్లే తో కనిపిస్తోంది. ఇది OnePlus 12R డిజైన్ అని అంతా ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు. ఈ ఫోన్ లో సెంటర్డ్ పంచ్-హోల్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా కనిపిస్తోంది.
OnePlus 12R బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ షేప్ లో కెమెరా మాడ్యూల్ ఉంది. మాడ్యూల్ చుట్టూ స్టీల్ ప్యానెల్ ఉంది. లీకైన రెండర్స్ లో అలర్ట్ స్లైడర్, పవర్ బటన్ కుడివైపున కనిపిస్తున్నాయి. ఫోన్ కి ఎడమవైపున వాల్యూమ్ రాకర్ ఉంది. బాటమ్ ఎడ్జ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
OnePlus 12R లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)
OnePlus 12R స్మార్ట్ ఫోన్ చైనాలో 2024 జనవరిలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 12 ఈ ఏడాది డిసెంబర్ లో లాంచ్ అయ్యాక OnePlus 12R ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఈ డివైజ్ కూడా తొలుత చైనాలో లాంచ్ అయ్యాక ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
OnePlus 12R స్పెసిఫికేషన్స్ (అంచనా)
రెండర్స్ తో పాటు OnePlus 12R డివైజ్ స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. సరే, ఓసారి OnePlus 12R స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం.
- డిస్ప్లే: OnePlus 12R స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OnePlus 12R డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus 12R స్మార్ట్ ఫోన్ లో 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: OnePlus 12R స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్ (2x జూమ్) ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
- బ్యాటరీ: OnePlus 12R లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్: OnePlus 12R స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











