జనవరి 4న చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 3; కన్ఫర్మ్ చేసిన కంపెనీ!

Highlights

  • OnePlus Ace 3 లాంచ్ తేదీ ప్రకటన
  • గ్లోబల్‌గా OnePlus 12R పేరుతో రానున్న Ace 3
  • Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Ace 3

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో Ace 3 ఫోన్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ OnePlus Ace 3 లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జనవరి 4న OnePlus Ace 3 చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ తో పాటు, గ్లోబల్ గా OnePlus Ace 3 డివైజ్ OnePlus 12R పేరుతో లాంచ్ అవుతుందని సమాచారం. ఇదివరకు వచ్చిన OnePlus Ace 2 కూడా OnePlus 11R పేరుతో ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి OnePlus Ace 3 లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Ace 3 చైనా లాంచ్ తేదీ

  • OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ చైనాలో జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోంది. టీజర్ ద్వారా కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.
  • గ్రే, గోల్డ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.
  • “OnePlus Ace 3, Ace 2 కి అప్‌గ్రేడ్ గా వస్తోంది. ఇది ఫ్లాగ్షిప్ అనుభూతిని మరోస్థాయికి తీసుకెళ్తుంది.” అని OnePlus చైనా హెడ్ లూయీస్ జీ చెప్పారు.

OnePlus Ace 3 డిజైన్

  • OnePlus Ace 3 ని వన్‌ప్లస్ సంస్థ చాలా రోజుల నుంచి సోషల్ మీడియా వేదికలపై టీజ్ చేస్తూ వస్తోంది. దీంతో డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది.
  • OnePlus Ace 3 డివైజ్ శాండ్ గోల్డ్, బ్లాక్ మరియు బ్లూ కలర్ వేరియంట్స్ లో కనిపించింది.
  • OnePlus Ace 3 లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని టీజర్స్ ద్వారా తెలుస్తోంది.
  • OnePlus Ace 3 లో కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటాయి. ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంటుంది.
  • OnePlus Ace 3 డివైజ్ కి టాప్ లో మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్ ఉంటాయి.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: లీక్స్ ప్రకారం, OnePlus Ace 3 డివైజ్ 6.78-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ తో రానుందని తెలుస్తోంది.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఈ చిప్ క్లాక్ స్పీడ్ 3.19గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
  • కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Ace 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
Previous articleAmazon టీజర్ ద్వారా itel A70 ఇండియా లాంచ్ ఖరారు
Next articleMWC 2024 ఈవెంట్‌లో భారత్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14?
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.