లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్

Highlights

  • డిసెంబర్ లో లాంచ్ కానున్న OnePlus Ace 3
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తోన్న డివైజ్

OnePlus సంస్థ త్వరలోనే ఏస్ సిరీస్ లో OnePlus Ace 3 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈ డివైజ్ ఫ్లాగ్షిప్ OnePlus 12 తో పాటు లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ డిసెంబర్ నెలలో చైనీస్ మార్కెట్ తోపాటు ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. ఇకపోతే, లాంచ్ కి ముందు OnePlus Ace 3 డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • టిప్‌స్టర్ DigitalChatStation రివీల్ చేసిన OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఓసారి చదివి తెలుసుకోండి.
  • టిప్‌స్టర్ OnePlus Ace 3 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు వెల్లడించారు.
  • ఇంకా ఈ డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలిపారు.
  • కెమెరా విషయానికి వస్తే, OnePlus Ace 3 లో సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంటాయని తెలుస్తోంది.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Ace 3 లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే రెజుల్యూషన్, పంచ్-హోల్ డిజైన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది.
  • మెమొరీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి/24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు.
  • కెమెరా: OnePlus Ace 3 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ ఒమ్నీ విజన్ ఓవీ8డీ10 లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • ఓఎస్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Ace 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.