ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus మార్చి నెలలో చైనాలో OnePlus Ace 2V ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 పేరుతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OnePlus Ace 3V కి సంబంధించి లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ లీక్స్ ద్వారా చిప్సెట్, డిస్ప్లే, లాంచ్ టైమ్‌లైన్ వంటి వివరాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
OnePlus Ace 3V ప్రధాన స్పెసిఫికేషన్స్ (లీక్)
- చైనీస్ సామాజిక మాధ్యమం Weibo పై టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OnePlus Ace 3V యొక్క చిప్సెట్ మరియు డిస్ప్లే స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు.
- టిప్‌స్టర్ ప్రకారం, OnePlus సంస్థ Ace బ్రాండ్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో ఓ స్మార్ట్‌ఫోన్ ని తీసుకురానుందని సమాచారం.
- త్వరలో రాబోవు ఈ స్మార్ట్‌ఫోన్ 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లేని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
- అయితే లీక్‌స్టర్ ఫోన్ పేరుని తెలపలేదు. కానీ, ఇది OnePlus Ace 3V కావచ్చని అందరూ అంచనా వేస్తున్నారు.
OnePlus Ace 3V లాంచ్ టైమ్‌లైన్, ఇతర వివరాలు
- OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ 2024 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మార్కెట్ లో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
- OnePlus Ace 2V భారత్ తో పాటు గ్లోబల్ గా OnePlus Nord 3 పేరుతో లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ ధర రూ.33,999 గా ఉంది.
- OnePlus Ace 3V గ్లోబల్ గా OnePlus Nord 4 పేరుతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే కంపెనీ దీని గురించి ఇంకా ఏ ప్రకటన చేయలేదు.
OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OnePlus Ace 2V లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1440 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
- చిప్సెట్: OnePlus Ace 2V లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, మాలి-జీ710 10-కోర్ జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 2V లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: OnePlus Ace 2V ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: OnePlus Ace 2V లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ సోని ఐఎంఎక్స్355 సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: OnePlus Ace 2V లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
- కనెక్టివిటీ: OnePlus Ace 2V లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ ఉన్నాయి.
- కలర్స్: OnePlus Ace 2V డివైజ్ మిస్టీ గ్రీన్ మరియు టెంపెస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
