6500mAh బ్యాటరీతో వస్తోన్న OnePlus Ace 5, Ace 5 Pro, లీకైన వివరాలు

Highlights

  • త్వరలో OnePlus Ace 5, 5 Pro విడుదల
  • తాజాగా లీకైన బ్యాటరీ, చిప్సెట్ వివరాలు
  • 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఏస్ సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro పేర్లతో ఈ డివైజెస్ విడుదల కానున్నాయి. తాజాగా, ఈ రెండు ఫోన్లకు సంబంధించిన బ్యాటరీ మరియు చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ డివైజెస్ 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలిసింది. ఇతర వివరాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro వివరాలు (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై OnePlus Ace 5, OnePlus Ace 5 Pro డివైజ్ యొక్క సమాచారాన్ని షేర్ చేశారు.

డిసెంబర్ ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో OnePlus Ace 5 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

టిప్‌స్టర్ పోస్ట్ గమనిస్తే, OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ (SM8750) మరియు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ (SM8650) తో వస్తున్నట్లు తెలుస్తోంది.

OnePlus Ace 5, OnePlus Ace 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

బ్యాటరీ: OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro స్మార్ట్‌ఫోన్లు 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలిసింది. అలాగే ఈ డివైజెస్ 100 వాట్ డ్యూయల్-సెల్ ర్యాపిడ్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నాయని సమాచారం.

కెమెరా: OnePlus Ace 5 Pro డివైజ్ లో జెఎన్1 టెలీఫోటో లెన్స్ ఉంటుంది. ఇక రెండు మోడల్స్ లో సోని ఐఎంఎక్స్9-సిరీస్ 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది 1/1.56-ఇంచులు గల భారీ సైజు సెన్సర్ తో వస్తోంది.

డిస్ప్లే: OnePlus Ace 5 సిరీస్ లో వచ్చే ఫోన్లు సిరామిక్ బిల్డ్, ఫ్లాట్ డిస్ప్లే, బీఓఈ ఎక్స్2 స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, రైట్-యాంగిల్ మెటల్ మిడిల్ ఫ్రేమ్ కలిగి ఉంటాయని సమాచారం.

ఆపరేటింగ్ సిస్టమ్: OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 15 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతాయి.

OnePlus Ace 5 Pro డిజైన్ (లీక్)

గతంలో లీక్స్ ప్రకారం, వన్‌ప్లస్ ఏస్ 5 ప్రో డివైజ్ ఫ్లాట్ డిస్ప్లే, మెటర్ సైడ్ ఫ్రేమ్, సిరామిక్ లేదా గ్లాస్ బాడీతో రాబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.