Home News త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace Pro

త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace Pro

హైలైట్స్:

వరుసబెట్టి స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేస్తూ పోతున్న వన్ ప్లస్ కంపెనీ, ఈ ఏడాది బిజీగా మారిపోయింది. వన్ ప్లస్ లాంచ్ చేసిన ఫోన్స్ లో మిడ్-రేంజ్, ఫ్లాగ్ షిప్స్, నార్డ్ సిరీస్ ఫోన్స్ ఉన్నాయి. ఆగస్టు 3 న వన్ ప్లస్ 10టీ లాంచ్ కానుందని కన్ఫర్మ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న వన్ ప్లస్ తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. అయితే, ఈ ఫ్లాగ్ షిప్ కేవలం ఇండియా మరియు గ్లోబల్ మార్కెట్స్ కే పరిమితం కానుందని సమాచారం. చైనాలో మాత్రం వన్ ప్లస్ ఏస్ ప్రో అనే పేరుతో ట్వీక్డ్ వర్షన్ లాంచ్ అవుతుందని డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతోంది.

టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్ల గురించి తెలిపింది. వన్ ప్లస్ ఏస్ మోడల్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 16జిబి ర్యామ్ ఉంటాయని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. ఇవి తప్ప మరే ఇతర స్పెసిఫికేషన్స్ ను డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించలేదు.

OnePlus Ace Pro ధర (అంచనా)

వన్ ప్లస్ ఏస్ ప్రో ధర ఆర్ఎంబి 3,000 (దాదాపు రూ.35,500) నుంచి ఆర్ఎంబి 4000 (దాదాపు రూ.47,500) మధ్య ఉంటుందని సమాచారం.

OnePlus Ace Pro స్పెసిఫికేషన్స్

వన్ ప్లస్ 10టీ (వన్ ప్లస్ ఏస్ ప్రో) లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీవో 2.0 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్10+, ఆర్జీబీ, డిస్ప్లే పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.

వన్ ప్లస్ 10టీ (వన్ ప్లస్ ఏస్ ప్రో) లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 2*2 ఎంఐఎంఐ, వై-ఫై 802.11ఏ/బి/జి/ఎన్/ఏసి/ఏఎక్స్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, ఎస్బీసీ & ఏపీటీ హెచ్డీ & ఎల్డీఏసీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లున్నాయి.

వన్ ప్లస్ 10టీ (వన్ ప్లస్ ఏస్ ప్రో) లో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరా ఉండే అవకాశముంది. గ్లోబల్ వేరియంట్స్ లో కెమెరా స్పెసిఫికేషన్స్ మారే అవకాశముంది.