Snapdragon 778G చిప్‌, 8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌పై కనిపించిన Vivo V29 5G

Highlights

  • గూగుల్ ప్లే కన్సోల్ పై V2250 మోడల్ నంబర్‌తో కనిపించిన డివైజ్
  • 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఫోన్
  • ఇటీవలె ఎన్బీటీసీ సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo రానున్న రోజుల్లో V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Vivo V29 5G మోడల్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా Vivo V29 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జిబి చిప్సెట్, 8జిబి ర్యామ్ తదితర స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలిసింది. సరే, ఓసారి Vivo V29 5G లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు

  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Vivo V29 5G V2250 అనే మోడల్ నంబర్ తో కనిపించింది.
  • లిస్టింగ్ ద్వారా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • రీసెంట్ గా ఈ ఫోన్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో 4505 ఎంఏహెచ్ బ్యాటరీ సమాచారం రివీల్ అయ్యింది.
  • Vivo V29 5G డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోందని అంచనా వేస్తున్నారు.
  • ఇంకా Vivo V29 5G డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో 5జీ కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది.
  • గతంలో Vivo V29 5G హ్యాండ్సెట్ ఐఎండీఏ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo V29 5G లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
  • సెల్ఫీ కెమెరా: Vivo V29 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • చిప్సెట్: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండవచ్చు.
  • ఓఎస్: Vivo V29 5G డివైజ్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo V29 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4505 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo V29 5G మరియు Vivo V29 Pro డివైజెస్ కోసం భారతీయ యూజర్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే బ్రాండ్ నుంచి భారతీయ మార్కెట్ లో అఫీషియల్ టీజర్లు ఇంకా రివీల్ కాలేదు. కానీ, ఎన్నో సర్టిఫికేషన్స్ పై ఫోన్ కనిపించడంతో, లాంచ్ వచ్చే నెలలో ఉంటుందని భావిస్తున్నారు. ఈ సిరీస్ లో గత నెలలో యూరప్ మార్కెట్స్ లో Vivo V29 Lite లాంచ్ అయ్యింది.