లీకైన OnePlus Nord 3 ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్

Highlights

  • OnePlus Nord 3 లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న వన్‌ప్లస్ ఫ్యాన్స్
  • మే నెలాఖరు లోగా OnePlus Nord 3 లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా లీకైన OnePlus Nord 3 ధర, స్పెసిఫికేషన్స్

ఇటీవలె వన్‌ప్లస్ సంస్థ OnePlus Nord CE 3 Lite డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.19,999 ధర వద్ద లభిస్తోంది. కంపెనీ భారత్ లో నార్డ్ సిరీస్ లో మరొక ఫోన్ OnePlus Nord 3 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుంది. అయితే తాజాగా OnePlus Nord 3 ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.
సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 3 భారత మార్కెట్ ధర ఎంత ఉండనుంది?

OnePlus Nord 3 కొత్త లీక్ ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ నుంచి వచ్చింది. యోగేశ్ ప్రకారం, భారత్ లో OnePlus Nord 3 డివైజ్ సుమారు రూ.30,000 ధర వద్ద లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ డివైజ్ టాప్ మోడల్ ధర రూ.40,000 వరకు ఉండనుందని సమాచారం.

భారత్ లో OnePlus Nord 3 ఎప్పుడు లాంచ్ కానుంది?

లీక్ ద్వారా OnePlus Nord 3 డివైజ్ లాంచ్ కి సంబంధించిన కచ్చితమైన తేదీ తెలియలేదు. అయితే 6 నుంచి 8 వారాల్లో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని టిప్‌స్టర్ అంచనా వేశాడు. అంటే ఈ వన్‌ప్లస్ ఫోన్ మే నెలాఖరులో లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • 6.7-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్
  • 64+8+2ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus Nord 3 ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord 3 5జీ కనెక్టివిటీతో వస్తోంది. ఈ డివైజ్ లో ప్రాసెసింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus Nord 3 లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు సమాచారం. 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ డివైజ్ రానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర కన్ఫర్మ్ అవ్వనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.