
OnePlus సంస్థ వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నేడు OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ భారత్ లో లాంచ్ కానుంది. నార్డ్ 3 సిరీస్ లో లాంచెస్ ఈ ఫోన్ తో మొదలు కానున్నాయి. ఇకపోతే OnePlus Nord 3 5G డివైజ్ త్వరలోనే లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ డివైజ్ నేడు ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ మరియు టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. దీంతో ఈ ఫోన్ లాంచ్ సమీపంలోనే ఉందని స్పష్టమైంది.
OnePlus Nord 3 5G డివైజ్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. కాబట్టి, ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు.
లాంచ్ కి ముందు కొత్త సర్టిఫికేషన్స్ ని పొందిన OnePlus Nord 3 5G
OnePlus Nord 3 5G receives the NBTC certification. Launch imminent.#OnePlus #OnePlusNord3 pic.twitter.com/VoKtBlxKBe
— Mukul Sharma (@stufflistings) April 4, 2023
పైన ట్వీట్ లో కనిపిస్తోన్న విధంగా, OnePlus Nord 3 5G ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై OnePlus CPH2493 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది 5జీ హ్యాండ్సెట్ అని ఈ లిస్టింగ్ తో తేలిపోయింది. వివిధ ఆసియా దేశాల్లో OnePlus Nord 3 5G డివైజ్ లాంచ్ ఉంటుందని ఎన్బీటీసీ సర్టిఫికేషన్ హింట్ ఇచ్చింది. ఇదే డివైజ్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కూడా కనిపించింది. ఇక్కడ మీకోసం సర్టిఫికేషన్ లిస్టింగ్ అందజేస్తున్నాం.
OnePlus Nord 3 5G receives the TDRA certification.#OnePlus #OnePlusNord3 pic.twitter.com/ZwaN8N0axJ
— Mukul Sharma (@stufflistings) April 4, 2023
OnePlus Nord 3 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
OnePlus Nord 3 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో రానుందని సమాచారం. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. OnePlus Nord 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
OnePlus Nord 3 5G కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











