
నేడు వన్ ప్లస్ సంస్థ భారత మార్కెట్ లో OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ కోసం వన్ ప్లస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 108ఎంపి రియర్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 8జిబి వర్చువల్ ర్యామ్, సూపర్‌వూక్ ఎండ్యూరన్స్ ఎడిషన్ చార్జింగ్, బ్యాటరీ హెల్త్ ఇంజిన్, 6.72-ఇంచ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు. సరే, ఓసారి OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
భారత్ లో OnePlus Nord CE 3 Lite 5G ధర, విక్రయం, కలర్ ఆప్షన్స్
OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. అవి: పేస్టెల్ లైమ్, క్రొమాటిక్ గ్రే. భారత్ లో OnePlus Nord CE 3 Lite 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా నిర్ణయించారు. ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ మరియు వన్‌ప్లస్ వెబ్ సైట్స్ ద్వారా ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఈఎంఐ మరియు నెట్ బ్యాంకింగ్ పై రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు.
OnePlus Nord CE 3 Lite 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
- 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
- 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ
- 8జిబి వర్చువల్ ర్యామ్
- 108ఎంపి ఈఐఎస్ కెమెరా
- 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ డివైజ్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.
OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగిన డిస్ప్లే, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ తో వచ్చింది. ఇది బ్యాటరీ లైఫ్ ని పెంచడమే గాక, యాప్స్ మధ్య మారడాన్ని తేలిక చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు 200 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడ్ తో వచ్చాయి. ఈ డివైజ్ లో 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉండటం విశేషం.
OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఈఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












