OnePlus: 100W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Nord CE 4 5G

Highlights

  • భారత్‌లో OnePlus Nord CE 4 5G లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.24,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నార్డ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. OnePlus Nord CE 4 5G పేరుతో ఈ ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. వన్‌ప్లస్ ఫోన్లకు భారత్ లో జనాదరణ చాలా ఎక్కువే. దీంతో వన్‌ప్లస్ నుంచి ఏ ఫోన్ లాంచైనా యూజర్లు ఆసక్తిగా గమనిస్తారు. తాజాగా లాంచైన OnePlus Nord CE 4 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 100 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి OnePlus Nord CE 4 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 4 5G ధర, కలర్ ఆప్షన్స్

OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి వాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

OnePlus Nord CE 4 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు.

OnePlus Nord CE 4 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ ఫోన్ డార్క్ క్రోమ్ మరియు సెల్డన్ మార్బుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Nord CE 4 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ఓఎస్: OnePlus Nord CE 4 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: OnePlus Nord CE 4 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ ఐఎంఎక్స్355 లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Nord CE 4 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
  • కనెక్టివిటీ: OnePlus Nord CE 4 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, యూఎస్బీ టైప్-సీ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • సెక్యూరిటీ: OnePlus Nord CE 4 5G భద్రత కోసం ఐపీ54 రేటింగ్ ని అందించారు.
Previous articleMotorola Edge 50 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్
Next articleRealme: 45W చార్జింగ్, 120Hz డిస్ప్లేతో లాంచైన Realme 12x 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.