OnePlus: గీక్‌బెంచ్‌పై లిస్టైన OnePlus Nord N30 SE 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord N30 SE 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • Dimensity 6020 చిప్‌తో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus జనవరి 23న భారత్ లో OnePlus 12 మరియు OnePlus 12R ఫోన్లను లాంచ్ చేయనుంది. అయితే ఈలోపు మరొక ఫోన్ కి సంబంధించిన సమాచారం నెట్టింట్లో ప్రత్యక్షమైంది. వన్‌ప్లస్ కంపెనీ త్వరలోనే OnePlus Nord N30 SE 5G ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. తాజాగా ఈ డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Nord N30 SE 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

 

  • OnePlus Nord N30 SE 5G డివైజ్ గీక్‌బెంచ్ పై CPH2605 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో OnePlus Nord N30 SE 5G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • OnePlus Nord N30 SE 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • గీక్‌బెంచ్ పై OnePlus Nord N30 SE 5G డివైజ్ 4జిబి ర్యామ్ తో కనిపిస్తోంది.
  • బెంచ్‌మార్కింగ్ స్కోర్ గురించి మాట్లాడితే, OnePlus Nord N30 SE 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 703 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1781 పాయింట్లు స్కోర్ చేసింది.
  • గీక్‌బెంచ్ ద్వారా OnePlus Nord N30 SE 5G కి సంబంధించిన మరే ఇతర వివరాలు తెలియలేదు.

OnePlus Nord N30 5G

అమెరికన్ మార్కెట్ లో ప్రస్తుతం OnePlus Nord N30 5G మోడల్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇదే డివైజ్ భారత్ లో Nord CE 3 Lite 5G అనే పేరుతో లాంచ్ అయ్యింది. Nord CE 3 Lite 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో వచ్చింది. దీని ధర రూ.19,999 గా ఉంది. ఇక యూఎస్ మార్కెట్ లో OnePlus Nord N30 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 299.99 డాలర్లు (సుమారు రూ.24,800) గా ఉంది.

OnePlus Nord N30 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OnePlus Nord N30 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord N30 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. OnePlus Nord N30 5G డివైజ్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: OnePlus Nord N30 5G లో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Nord N30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord N30 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: OnePlus Nord N30 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
Previous articleOPPO: లీకైన OPPO F25 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్
Next articleRealme Note 50 గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.