
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో భారతీయ మార్కెట్ లో OnePlus Open డివైజ్ ని లాంచ్ చేయనుందని సమాచారం. అయితే ఇంకా కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. కానీ, తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేతిలో OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ కనిపించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. సరే, ఓసారి OnePlus Open డివైజ్ వైరల్ వీడియో వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
OnePlus Open వీడియో విశేషాలు
- ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ భయాని ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రముఖ నటి అనుష్క శర్మ OnePlus Open డివైజ్ పట్టుకుని కనిపించింది.
- OnePlus Open డివైజ్ భారీ కెమెరా మాడ్యూల్ తో రానుందని టిప్‌స్టర్ OnLeaks తెలిపింది.
- గత లీక్స్ లో కూడా OnePlus Open ఫోన్ సేమ్ డిజైన్ తో కనిపించింది.
- వీడియో మరియు టిప్‌స్టర్ తెలియజేసిన సమాచారం నిజమే అయితే గనుక, త్వరలోనే భారత్ లో OnePlus Open లాంచ్ అవ్వడం ఖాయం.
View this post on Instagram
OnePlus Open లాంచ్ తేదీ (అంచనా)
OnePlus Open లాంచ్ టైమ్‌లైన్ కి సంబంధించిన సమాచారం అక్టోబర్ 19 న వెల్లడవుతుందని తెలుస్తోంది. అసలైతే, ఈ ఫోన్ ఆగస్టు నెలలోనే లాంచ్ కావాల్సింది. కానీ, వాయిదా పడింది. డిస్ప్లే తయారీదారు మార్పుతో ఈ జాప్యం జరిగింది. అయితే ఇంకా లాంచ్ ప్రకటన అధికారికంగా వెలువడాల్సి ఉంది. త్వరలోనే వన్‌ప్లస్ సంస్థ ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది.
OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus Open లో 7.8-ఇంచ్ అమోలెడ్ 2కే స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.3-ఇంచ్ అమోలెడ్ ఔటర్ డిస్ప్లే ఉంటాయి. ఇది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది.
- ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడే అవకాశం ఉంది.
- మెమొరీ: OnePlus Open డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది.
- కెమెరా: OnePlus Open లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి లేదా 20ఎంపి ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.
- ఓఎస్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











