ఒప్పో సంస్థ నేడు OPPO A1x 5G స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇది మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్. 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో లాంచైంది. ఇప్పటికైతే ఈ ఫోన్ భారత్ కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇకపోతే ఈ ఫోన్ స్టైలిష్ లుక్స్, ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంది. OPPO A1x 5G యొక్క పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.
OPPO A1x 5G స్పెసిఫికేషన్స్
- 6.56-ఇంచ్ హెచ్డీ+ 90 హెర్ట్జ్ డిస్ప్లే
- 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
- మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్
- 13ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా
- 8ఎంపి ఫ్రంట్ కెమెరా
- 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
OPPO A1x 5G స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచైంది. ఈ ఫోన్ లో ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇంకా 600 నిట్స్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ ఆర్జీబీ కలర్ గేముత్ కి ఈ ఫోన్ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. OPPO A1x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
OPPO A1x 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది కూడా చదవండి: అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 12 4G
OPPO A1x 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. OPPO A1x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని వాడారు. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ని వాడారు.
OPPO A1x 5G ధర
OPPO A1x 5G స్మార్ట్ ఫోన్ చైనాలో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బేస్ మోడల్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్ల ధరలు వరుసగా 1399 యువాన్లు, 1599 యువాన్లు గా ఉన్నాయి. భారతీయ కరెన్సీలో వీటి ధరలు దాదాపు రూ.16,700 మరియు రూ.19,000 గా ఉంటాయి. చైనీస్ మార్కెట్ లో క్వైట్ సీ బ్లూ, స్టారీ స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
