
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ చైనాలో Moto X50 Ultra డివైజ్‌ని లాంచ్ చేసింది. Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2715*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. ఓసారి Moto X50 Ultra యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.
Moto X50 Ultra స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Moto X50 Ultra లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+ సపోర్ట్, డీసీ డిమ్మింగ్, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Moto X50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.
ర్యామ్, స్టోరేజీ: Moto X50 Ultra డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఓఎస్: Moto X50 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Moto X50 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్, 64ఎంపి 3x టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: Moto X50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Moto X50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, డాల్బీ హెడ్ ట్రాకింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
సెక్యూరిటీ: Moto X50 Ultra లో ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఈ ఫోన్ అల్యూమినియమ్ ఫ్రేమ్ తో వచ్చింది.
Moto X50 Ultra ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్
Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 3999 యువాన్లు (సుమారు రూ.47,105) గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 4299 యువాన్లు (సుమారు రూ.50,639) గా ఉంది. 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 4699 యువాన్లు (సుమారు రూ.55,350) గా ఉంది.
Moto X50 Ultra డివైజ్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. మే 24 నుంచి అఫీషియల్‌గా సేల్ మొదలవుతుంది.
Moto X50 Ultra స్మార్ట్‌ఫోన్ నార్డిక్ వుడ్, ఫారెస్ట్ గ్రే వీగన్ లెదర్ మరియు పీచ్ ఫజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











