8జిబి ర్యామ్, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో లాంచైన OPPO A78 5G

హైలైట్స్

  • మలేషియాలో లాంచైన OPPO A78 5G స్మార్ట్ ఫోన్, భారత్ లో జనవరి 14 న లాంచ్ అయ్యే అవకాశం
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్ తో వచ్చిన OPPO A78 5G డివైజ్
  • ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టంట్ రేటింగ్ ని కలిగి ఉన్న OPPO A78 5G స్మార్ట్ ఫోన్

ఒప్పో కంపెనీ కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని వచ్చే వారం భారత్ లో లాంచ్ చేయబోతోంది. ఆ ఫోన్ పేరు OPPO A78 5G. ఈ ఫోన్ తాజాగా మలేషియా మార్కెట్ లో లాంచైంది. కొన్ని నెలల క్రితం చైనాలో లాంచైన ఒప్పో ఏ58 5జీ కి OPPO A78 5G రీబ్రాండెడ్ వర్షన్. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తో OPPO A78 5G లాంచైంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. పవర్ బ్యాక్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుంది. సరే, ఓసారి OPPO A78 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

OPPO A78 5G ధర, లభ్యత

OPPO A78 5G యొక్క ధరను ఒప్పో కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మలేషియాలో లాంచ్ అయ్యింది. జనవరి 14 న భారత్ లో లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.54-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ (1612*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ నాచ్, పండా గ్లాస్ ఉన్నాయి.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ తో వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO A78 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ అందించారు. ఇక భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ డివైజ్ స్టీరియో స్పీకర్, 3.5ఎంఎం ఆడియో జాక్ తో వచ్చింది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ పర్పుల్. ఈ స్మార్ట్ ఫోన్ 163.8 మిల్లీ మీటర్ల పొడవు, 75.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.99 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleDimensity 810 చిప్, 90Hz రిఫ్రెష్ రేట్, 8GB ర్యామ్‌తో లాంచైన OPPO A56s
Next articleOPPO F23 5G గా భారత్‌లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G?
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.