
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారత్ లో OPPO A79 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇదొక మిడ్-రేంజ్ బడ్జెట్ ఫోన్. OPPO A79 5G స్మార్ట్‌ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్, వర్చువల్ ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. సరే, ఓసారి OPPO A79 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, సేల్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
OPPO A79 5G ధర, లభ్యత, ఆఫర్స్

- OPPO A79 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
- 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంది.
- OPPO A79 5G డివైజ్ గ్లోయింగ్ గ్రీన్, మిస్టరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- అక్టోబర్ 28 నుంచి ఒప్పో స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
- ఆఫర్స్ గురించి మాట్లాడితే, OPPO A79 5G డివైజ్ ని ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్స్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ మరియు 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
- పాత కస్టమర్లకు కంపెనీ రూ.4,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందిస్తోంది.
OPPO A79 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO A79 5G లో 6.72-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సన్‌లైట్ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఏఐ ఐ కంఫర్ట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO A79 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు. హైపర్ఇంజిన్ 3.0 లైట్ గేమింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
- మెమొరీ: OPPO A79 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు. అలాగే 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంది. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ లభిస్తుంది.
- బ్యాటరీ: OPPO A79 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్: OPPO A79 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO A79 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.











