ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం F25 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఓషన్ బ్లూ మరియు లావా రెడ్ కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. తాజాగా కోరల్ పర్పుల్ అనే కొత్త కలర్ వేరియంట్ ని ఒప్పో లాంచ్ చేసింది. OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO F25 Pro 5G కోరల్ పర్పుల్ వేరియంట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
OPPO F25 Pro 5G ధర, లభ్యత
OPPO F25 Pro 5G కోరల్ పర్పుల్ కలర్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.23,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్‌ని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఒప్పో ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ పై లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ క్రెడిట్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీబీ ఫైనాన్షియల్ మరియు హోమ్ క్రెడిట్ ద్వారా జీరో డౌన్ పేమెంట్ స్కీమ్స్‌ని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
OPPO F25 Pro 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO F25 Pro 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్), 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, పాండా గ్లాస్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: OPPO F25 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- సాఫ్ట్వేర్: OPPO F25 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: OPPO F25 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 కెమెరా ఉంది.
- బ్యాటరీ: OPPO F25 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సెక్యూరిటీ: OPPO F25 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.
- కనెక్టివిటీ: OPPO F25 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 6, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: OPPO F25 Pro 5G డివైజ్ 161.6 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.54 మి.మీ మందం ఉంటుంది.
