OPPO F27 5G: లీకైన ఒప్పో ఎఫ్27 5జీ ఇండియా ధర, పూర్తి స్పెసిఫికేషన్స్

Highlights

  • ఆగస్టు 16 నుంచి మొదలైన ఆఫ్‌లైన్ ప్రీ-ఆర్డర్స్
  • OPPO F27 5G ప్రారంభ ధర రూ.22,999
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO వచ్చే వారం భారతీయ మార్కెట్ లో OPPO F27 5G ను లాంచ్ చేయనుందని వార్తలు వినిపించాయి. గత వారం లైవ్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. మరోవైపు, OPPO F27 5G ఇండియా లాంచ్ వివరాలు అమెజాన్ పై టీజ్ చేయబడ్డాయి. ఇదిలా ఉండగా, తాజాగా 91mobiles Hindi వెబ్‌సైట్ OPPO F27 5G యొక్క ధరలతో పాటు, స్పెసిఫికేషన్స్‌ను లీక్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO F27 5G ఇండియా ధర (లీక్)

91మొబైల్స్ హిందీ కథనం ప్రకారం, OPPO F27 5G యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధర రూ.22,999 గా ఉంటుంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.24,999 గా ఉంటుంది.

హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ మరియు కొటక్ బ్యాంక్స్ లావాదేవీలపై రూ.1,800 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా 6 నెలల పాటు వన్-టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ ను ఒప్పో ఆఫర్ చేస్తోంది.

OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రీ-బుకింగ్స్ ఆగస్టు 16 నుంచి ఆఫ్‌లైన్ స్టోర్లలో మొదలయ్యాయి. ఆగస్టు 18 నుంచి సేల్ మొదలవుతుందని సమాచారం.

OPPO F27 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO F27 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO F27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO F27 5G లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీ అందించారు.

కెమెరా: OPPO F27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: OPPO F27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 5G లో ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్: OPPO F27 5G డివైజ్ అంబర్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.