OPPO F27 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన ఒప్పో ఎఫ్‌27 5జీ

Highlights

  • భారత్‌లో లాంచైన OPPO F27 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్
  • ప్రారంభ ధర రూ.22,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలైంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO F27 5G ధర మరియు లభ్యత

OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.22,999 గా నిర్ణయించారు.

OPPO F27 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా పెట్టారు. ఈ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్ మరియు అంబర్ ఆరెంజ్ కలర్స్ లో లభిస్తుంది.

OPPO F27 5G డివైజ్‌ను ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OPPO F27 5G కొనేవారికి రూ.2,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, వన్‌కార్డ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టర్లకు ఈ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఒప్పో ఈ-స్టోర్ పై ఈ ఆఫర్ పొందవచ్చు.

OPPO F27 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO F27 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్వా డైనమిక్స్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 92.2 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO F27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ2 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: OPPO F27 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO F27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50డి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి1బి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: OPPO F27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 5G లో ఐపీ64 రేటింగ్, 300 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Previous articleMotorola Razr 50 ఫ్లిప్ ఫోన్ ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల
Next articleVivo T3 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.