
అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ నేడు భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఫ్లిప్ మరియు ఫోల్డబుల్ ఫోన్స్ సెగ్మెంట్ లో ఇప్పటికే బలంగా పాతుకుపోయిన శాంసంగ్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఒప్పో రంగంలోకి దిగింది. తాజాగా లాంచైన OPPO Find N2 Flip తో శాంసంగ్ కి కష్టకాలం మొదలుకానుంది.
OPPO Find N2 Flip డివైజ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ ఫోన్ డ్యూయల్ డిస్ప్లేస్ తో వస్తోంది. మెయిన్ డిస్ప్లే కాకుండా, బ్యాక్ ప్యానెల్ పై మరొక డిస్ప్లే ఉంటుంది. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండు తెరలు కూడా అమోలెడ్ ప్యానెల్స్ కావడం విశేషం.
OPPO Find N2 Flip ధర, లభ్యత
OPPO Find N2 Flip గ్లోబల్ మార్కెట్ ధర 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ కి 849 యూరోలు (సుమారు Rs 84,350) గా ఉంది. భారత మార్కెట్ ధర ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఫోన్ ని ఆసక్తిగల వారు ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్
- మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్
- 6.8-ఇంచ్ అమోలెడ్ మెయిన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- 3.26-ఇంచ్ ఔటర్ డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్
- 16జిబి వరకు ర్యామ్
- 512జిబి వరకు స్టోరేజీ
- 50ఎంపి మెయిన్ కెమెరా
- 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా
- 32ఎంపి ఫ్రంట్ కెమెరా
- 4,300ఎంఏహెచ్ బ్యాటరీ
- 44 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్
OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ అమోలెడ్ ఔటర్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. OPPO Find N2 Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇప్పుడు OPPO Find N2 Flip డివైజ్ యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. OPPO Find N2 Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











