
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Oppo ఇటీవల చైనాలో OPPO Find N3 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మరోవైపు అందరూ గ్లోబల్ మరియు ఇండియన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ డివైజ్ NBTC మరియు BIS సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ లో కనిపించింది. దీంతో ఈ ఫోన్ లాంచ్ అతి త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. సరే, ఓసారి ఈ డివైజ్ సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
NBTC, BIS సర్టిఫికేషన్స్ పై కనిపించిన OPPO Find N3 Flip
ఒకే మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ, బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్‌సైట్స్ పై OPPO Find N3 Flip కనిపించింది.
- OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ CPH2519 మోడల్ నంబర్ తో బీఐఎస్ మరియు ఎన్బీటీసీ వెబ్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది.
- TKDN, IMDA వంటి ఇతర మార్కెట్‌ల సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లలో కూడా ఇదే మోడల్ నంబర్ కనిపించింది.
- లిస్టింగ్‌లో ఇతర స్పెసిఫికేషన్ వివరాలు లేనప్పటికీ, ఈ ఫోన్ త్వరలో భారతదేశంతో సహా ఇతర మార్కెట్‌లలోకి ప్రవేశిస్తుందని స్పష్టమవుతోంది.
- OPPO Find N3 Flip యొక్క స్పెసిఫికేషన్‌లు చైనీస్ మోడల్‌కు సమానంగా ఉంటాయని భావిస్తున్నారు. ఓసారి OPPO Find N3 Flip యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
OPPO Find N3 Flip స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: OPPO Find N3 Flip లో 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ స్క్రీన్, 6.80-ఇంచ్ అమోలెడ్ ఇన్నర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OPPO Find N3 Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: OPPO Find N3 Flip లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.











