తక్కువ బడ్జెట్‌లో 8GB ర్యామ్, 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ అందించే ఫోన్ ఇదే!

Highlights

  • భారత్‌లో లాంచైన Infinix Smart 8 Plus
  • 8జిబి ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Infinix Smart 8 Plus ధర రూ.7,799

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Infinix భారతీయ మార్కెట్ లో ఒక కొత్త స్మార్ట్ 8 సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Smart 8 Plus పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ ఉన్నాయి. తక్కువ ధరలో లాంచైన ఈ ఫోన్ ఎంట్రీ-లెవెల్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. సరే, ఓసారి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్లు, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 Plus ధర, లభ్యత

Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎలా ఉందో చూద్దాం.

భారత్ లో Infinix Smart 8 Plus ధరను రూ.7,799 గా నిర్ణయించారు. గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్ మరియు టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్‌ని కేవలం రూ.6,999 కే సొంతం చేసుకోవచ్చు.

మార్చి 9వ తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix Smart 8 Plus సేల్ మొదలవుతుంది.

Infinix Smart 8 Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Smart 8 Plus లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Smart 8 Plus డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ఉన్నాయి. ఈ మొబైల్ 1,44,895 అంటుటు స్కోర్ నమోదు చేసింది.
  • ఓఎస్: Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 Plus డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 2టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Infinix Smart 8 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Infinix Smart 8 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు.
  • ఇతర ఫీచర్లు: Infinix Smart 8 Plus లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్ + గ్లొనాస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇంటరాక్టివ్ మ్యాజిక్ రింగ్, టింబర్ టెక్షర్ ప్యాటర్న్, డీటీఎస్ సౌండ్, ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Infinix Smart 8 Plus డివైజ్ 163.6 మి.మీ పొడవు, 75.6 మి.మీ వెడల్పు, 8.5 మి.మీ మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది.
Previous articleOPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 స్పెసిఫికేషన్స్
Next articleRealme: 24GB ర్యామ్ పవర్‌తో భారత్ లో లాంచైన Realme 12+ 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.