
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO జులైలో K12x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అప్పుడు బ్రీజ్ బ్లూ మరియు మిడ్నైట్ వయొలెట్ కలర్స్ లో ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పుడు, ఫెదర్ పింక్ అనే కొత్త కలర్ లో OPPO K12x 5G లాంచ్ అయ్యింది. అంతేకాదు, లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ కేవలం రూ.10,999 కే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అందుబాటులోకి రానుంది. మరి పూర్తి వివరాలు తెలుసుకుందామా?
OPPO K12x 5G ఫెదర్ పింక్ కలర్ ధర
OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ ఫెదర్ పింక్ కలర్ వేరియంట్ ధరను ఇతర కలర్ వేరియంట్స్ మాదిరే పెట్టారు.
6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.12,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు.
OPPO K12x 5G ఫెదర్ పింక్ కలర్ వేరియంట్ సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ లో జరగబోవు బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
సేల్ సమయంలో OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ ని కేవలం రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు.

OPPO K12x 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO K12x 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
ర్యామ్, స్టోరేజీ: OPPO K12x 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: OPPO K12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32ఎంపి అల్ట్రా-క్లియర్ ఏఎఫ్ మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: OPPO K12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.
సాఫ్ట్‌వేర్: OPPO K12x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: OPPO K12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: OPPO K12x 5G లో ఐపీ54 రేటింగ్, ఏఐ లింక్ బూస్ట్ టెక్నాలజీ, ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. ఏఐ లింక్ బూస్ట్ ఫీచర్ ద్వారా తక్కువ నెట్వర్క్ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో కూడా మంచి నెట్వర్క్ అందుతుంది.











