
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. iQOO 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీకైన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
iQOO 13 లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్)
Smartprix కథనం ప్రకారం, iQOO 13 స్మార్ట్‌ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.55,000 ఉంటుందని తెలుస్తోంది. ఇది బేస్ వేరియంట్ ధర. ఇకపోతే, గత మోడల్ iQOO 12 (12జిబి+256జిబి) రూ.52,999 ధరతో లాంచ్ అయ్యింది.
లాంచ్ టైమ్‌లైన్ విషయానికి వస్తే, iQOO 13 డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్య చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత మోడల్ కూడా ఇదే నెలలో భారత్ లో లాంచ్ అయ్యింది. కాబట్టి, ఈసారి కూడా ఇదే టైమ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
iQOO 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: iQOO 13 లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2కే ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
చిప్సెట్: iQOO 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో లాంచ్ అవ్వనుంది. అక్టోబర్ లో ఈ ప్రాసెసర్ లాంచ్ అవుతుంది. గత మోడల్ iQOO 12 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వచ్చింది.
ర్యామ్, స్టోరేజీ: iQOO 13 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో వచ్చే అవకాశం ఉంది.
రియర్ కెమెరా: iQOO 13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉంటాయి.
బ్యాటరీ, చార్జింగ్: iQOO 13 లో పవర్ బ్యాకప్ కోసం 6,150 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
ఇతర ఫీచర్లు: iQOO 13 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, ఐపీ68 రేటింగ్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.











