
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారత్ లో ఈ ఏడాది జులైలో OPPO Reno 10 Pro ని లాంచ్ చేసింది. దీంతో పాటు OPPO Reno 10, OPPO Reno 10 Pro+ కూడా లాంచ్ అయ్యాయి. తాజాగా OPPO Reno 10 Pro ధరను కంపెనీ తగ్గించింది. OPPO Reno 10 Pro ధర భారతీయ మార్కెట్ లో రూ.2,000 వరకు తగ్గింది. ఇప్పటికే చైనాలో OPPO Reno 11 సిరీస్ లాంచ్ కాగా, త్వరలో భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.
భారత్ లో OPPO Reno 10 Pro ధర, లభ్యత
- OPPO Reno 10 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ రూ.39,999 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ధరను కంపెనీ తగ్గించింది.
- OPPO Reno 10 Pro పై రూ.2,000 ధర తగ్గడంతో భారత్ లో ఈ డివైజ్ ధర రూ.37,999 కి చేరుకుంది.
- ఈ తగ్గిన ధర ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెట్స్ కి వర్తిస్తుంది. ఇప్పటికే తగ్గిన ధర కంపెనీ యొక్క అధికార వెబ్‌సైట్ మరియు ఇతర ఆన్‌లైన్ స్టోర్స్ లో కనిపిస్తోంది.
OPPO Reno 10 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Reno 10 Pro 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 950 నిట్స్ బ్రైట్నెస్, 93 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
- చిప్సెట్: OPPO Reno 10 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి 5జీ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఇంకా ఈ ఫోన్ లో వీసీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. దీని వల్లన ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.
- స్టోరేజీ: OPPO Reno 10 Pro 5G లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. ర్యామ్ ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
- కెమెరా: OPPO Reno 10 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్890 అల్ట్రా క్లియర్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో పొట్రెయిట్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఐఎంఎక్స్709 లెన్స్ ఉంది.
- బ్యాటరీ: OPPO Reno 10 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 28 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
- ఓఎస్: OPPO Reno 10 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.












