Vivo S18 ట్రిపుల్-కెమెరా సెటప్‌ని టీజ్ చేసిన వివో

Highlights

  • 50ఎంపి ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తోన్న Vivo S18
  • డిసెంబర్ 4 న Vivo S18 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం
  • లైనప్ లో వస్తోన్న Vivo S18, Vivo S18 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo S18 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో Vivo S18, Vivo S18 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. చైనీస్ టిప్‌స్టర్ WhyLab నిన్న చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై Vivo S18 సిరీస్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని షేర్ చేసింది. ఇప్పుడు అఫీషియల్ లాంచ్ కి ముందు వివో ప్రొడక్ట్స్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ Ouyang Weifeng వీబో పై టీజర్ ఇమేజ్ ని షేర్ చేశారు. దీంతో Vivo S18 స్మార్ట్‌ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది.

Snapdragon 7 Gen 3 చిప్‌తో రానున్న Vivo S18

  • టీజర్ ఇమేజ్ ని గమనిస్తే బ్యాక్ ప్యానెల్ పై పూలకు సంబంధించిన డిజైన్ కనిపిస్తోంది.
  • ఇంకా ఫోన్ కి బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ షేప్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ ఉంది.
  • కెమెరా మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఓఐఎస్ సపోర్ట్ ఉంటాయి.
  • ట్రిపుల్ కెమెరా సెటప్ కి తోడుగా ఒక ఎల్ఈడీ ఫ్లాష్, ఒక సాఫ్ట్ లైట్ ఉన్నాయి.

Vivo S18 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo S18 లో ముందు వైపున పంచ్-హోల్ డిస్ప్లే ఉంటుంది. ఇది 2,800 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తున్నట్లు సమాచారం.
  • ప్రాసెసర్: Vivo S18 డివైజ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo S18 డివైజ్ 8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.
  • కెమెరా: Vivo S18 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

Vivo S18 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్920 మెయిన్ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, టెలీఫోటో లెన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Vivo S18 Pro వై-ఫై 7 కనెక్టివిటీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం, Vivo S18 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. డిసెంబర్ 4 వ తేదీన Vivo S18 సిరీస్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Previous articleలీకైన Xiaomi 14 Ultra కెమెరా స్పెసిఫికేషన్స్
Next articleOPPO Reno 10 Pro ధర తగ్గింపు; కొత్త ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.