
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నేడు చైనాలో OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. అవి: Oppo Reno 10, Reno 10 Pro, Reno 10 Pro+. సరే, పదండి, ఓసారి ఒప్పో లాంచ్ చేసిన రెనో 10 సిరీస్ గురించి తెలుసుకుందాం.
OPPO Reno 10 సిరీస్ ధర
8జిబి ర్యామ్+256జిబి స్టోరేజీ=2499 యువాన్లు (రూ.29,290
12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ= 2799 యువాన్లు (రూ.32,900)
12జిబి ర్యామ్+512జిబి స్టోరేజీ=2999 యువాన్లు (రూ.35,000)
Oppo Reno 10 Pro ధర
16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ= 3499 యువాన్లు (సుమారు రూ.41,000)
16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ= 3899 యువాన్లు (సుమారు రూ.45,000)
OPPO Reno 10 Pro+ ధర
16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 3800 యువాన్లు (సుమారు రూ.45,000)
16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ = 4299 యువాన్లు (సుమారు రూ.50,000)
OPPO Reno 10 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- కర్వ్డ్ ఓఎల్ఈడీ
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
OPPO Reno 10 5జీ డివైజ్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
చిప్సెట్, బ్యాటరీ
- స్నాప్ డ్రాగన్ 778జి
- 4600 ఎంఏహెచ్ బ్యాటరీ
OPPO Reno 10 5జీ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడారు. ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
కెమెరా విభాగం
- 64ఎంపి కెమెరా
- 32ఎంపి టెలీఫోటో లెన్స్
OPPO Reno 10 స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి రియర్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
OPPO Reno 10 Pro స్పెసిఫికేషన్స్
చిప్సెట్, ఓఎస్
- డైమెన్సిటీ 8200
- ఆండ్రాయిడ్ 13
Oppo Reno 10 Pro డివైజ్ లో 3.1GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే MediaTek Dimensity 8200 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
డిస్ప్లే
- 6.74-ఇంచ్ స్క్రీన్
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
OPPO Reno 10 Pro స్మార్ట్‌ఫోన్ 2772×1240 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల FullHD+ డిస్‌ప్లేని కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే AMOLED ప్యానెల్‌పై తయారైంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.
కెమెరా విభాగం
- 32ఎంపి సెల్ఫీ కెమెరా
- 50ఎంపి మెయిన్ కెమెరా
Oppo Reno 10 Pro డివైజ్ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి కెమెరా అందించారు.
బ్యాటరీ
- 4600 ఎంఏహెచ్
- 100 వాట్
ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,600 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ 2.0 చార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.
OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్
చిప్సెట్, ఓఎస్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1
- ఆండ్రాయిడ్ 13
ఈ ఫోన్ లో 2.995GHz క్లాక్ స్పీడ్‌తో నడిచే Qualcomm Snapdragon 8+ Gen1 ఆక్టాకోర్ చిప్ ఉంది. గ్రాఫిక్స్ కోసం, ఈ ఫోన్ లో Adreno 730 GPU ని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
డిస్ప్లే
- 6.74-ఇంచ్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
ఈ ఫోన్ లో 2772 × 1240 పిక్సెల్ రిజల్యూషన్ కలిగిన 6.74-అంగుళాల FullHD+ డిస్ప్లే ఉంది. ఇంకా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పనిచేసే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంది. ఈ మొబైల్ ఫోన్ 1400నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా విభాగం
- 50ఎంపి రియర్
- 32ఎంపి ఫ్రంట్ కెమెరా
OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు 64ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ
- 4700 ఎంఏహెచ్
- 100 వాట్ చార్జింగ్
Oppo Reno 10 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 4,700 mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది. ఫోన్ ని నిమిషాల వ్యవధిలో పూర్తిగా చార్జ్ చేస్తుంది.











