OPPO Reno 11 Pro: లీకైన ఇండియన్ యూనిట్ అన్‌బాక్సింగ్ వీడియో

Highlights

  • జనవరి 12న లాంచ్ అవుతోన్న OPPO Reno 11 Pro
  • డైమెన్సిటీ 8200 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • కలర్ ఆప్షన్స్: పర్ల్ వైట్ మరియు రాక్ గ్రే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11 సిరీస్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro అనే డివైజెస్ లాంచ్ కానున్నాయి. జనవరి 12 న OPPO Reno 11 సిరీస్ విడుదలవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎక్స్‌క్లూజివ్ గా ఈ సిరీస్ సేల్ కి రానుంది. తాజాగా OPPO Reno 11 Pro డివైజ్ యొక్క అన్‌బాక్సింగ్ వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే ఈ వీడియోను షేర్ చేశారు. దీంతో OPPO Reno 11 Pro కి సంబంధించిన స్పెసిఫికేషన్స రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 Pro ఇండియన్ యూనిట్ అన్‌బాక్సింగ్ వీడియో

  • ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే OPPO Reno 11 Pro యొక్క ఇండియన్ వేరియంట్ అన్‌బాక్సింగ్ వీడియోని X ఖాతా ద్వారా షేర్ చేశారు.
  • వీడియోలో కనిపించిన డివైజ్ పర్ల్ వైట్ కలర్ లో కనిపించింది.
  • డివైజ్ కర్వ్డ్ డిస్ప్లే, సెంటర్ట్ పంచ్ హోల్ కటౌట్ కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 11 Pro లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1240*2772 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Oppo Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Oppo Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-700 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
Previous articleLava నుంచి త్వరలో రానున్న Blaze Curve 5G; టీజ్ చేసిన కంపెనీ!
Next articleSamsung Galaxy S24 Ultra: లాంచ్‌కి ముందు లీకైన డివైజ్ లైవ్ ఇమేజెస్!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.