
ప్రముఖ టెక్‌బ్రాండ్ శాంసంగ్ Samsung Galaxy S24 సిరీస్ ని జనవరి 17న లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా టాప్ మోడల్ Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో కొత్త కలర్ వేరియంట్ రివీల్ అయ్యింది. ఓసారి Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజ్, కొత్త కలర్ వేరియంట్ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S24 Ultra లైవ్ ఇమేజెస్ (లీక్)
God damn it looks beautiful!
Samsung made this color so good, compared to its rivals ? pic.twitter.com/dMZWCk8t9M— Amir (@WorkaholicDavid) January 6, 2024
- సామాజిక మాధ్యమం X పై అమిర్ (@WorkaholicDavid) అనే యూజర్ Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ షేర్ చేశారు.
- ఈ ఇమేజెస్ ని చూస్తే డివైజ్ కొత్త కలర్ వేరియంట్ రివీల్ అయినట్లు తెలుస్తోంది. ఇది టైటానియమ్ గ్రే కలర్ అని భావిస్తున్నారు.
- ఇది వైబ్రంట్ లేదా ఫ్లాషీ గా లేదు. మునుపటి అల్ట్రా సిరీస్ రంగుల మాదిరి ఉంది. బ్యాక్ ప్యానెల్, ఫ్రేమ్, బటన్స్, కెమెరా రింగ్స్ అన్నీ కూడా ఒకే రంగులో ఉన్నాయి.
- Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వయొలెట్ మరియు యెల్లో కలర్ ఆప్షన్స్ లో వస్తుందని రూమర్లు వినిపించాయి.
- ఇవే కాకుండా, ఆరెంజ్, గ్రీన్ మరియు బ్లూ వంటి ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్స్ లో కూడా ఈ ఫోన్ లభిస్తుందని సమాచారం.
- ఫోన్ యొక్క అఫీషియల్ రెండర్స్ అని లీక్‌స్టర్ ఇవాన్ బ్లాస్ షేర్ చేసిన పిక్స్ ద్వారా ఈ కలర్స్ రివీల్ అయ్యాయి.
- Samsung Galaxy S24 Ultra బ్యాక్ ప్యానెల్ పై కెమెరా లెన్స్‌లు నిలువుగా అమర్చబడి ఉన్నాయి. ఎడ్జ్‌లు ఫ్లాట్ గా ఉన్నాయి.
iPhone 15 Pro సిరీస్ డివైజెస్ లో మాదిరిగా Samsung Galaxy S24 Ultra సైడ్ ఫ్రేమ్ టైటానియమ్ తో తయారై ఉంటుందని విశ్వసిస్తున్నారు. ఈ మెటీరియల్ తప్పు పట్టదు, ఇంకా తేలికగా ఉండటంతో పాటు సులభంగా రిసైకిల్ చేయడం సాధ్యమవుతుంది.
Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy S24 Ultra లో 6.8-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, క్యూహెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, సెంటర్ పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. మరొక వేరియంట్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తోంది. అలాగే గెలాక్సీ ఏఐ ఫీచర్స్ ని కంపెనీ టీజ్ చేస్తోంది.
- మెమొరీ: Samsung Galaxy S24 Ultra డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి వరకు స్టోరేజీతో వస్తోంది.
- బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy S24 Ultra ధర (అంచనా)
- టిప్‌స్టర్ రొలాండ్ క్వాండ్ట్ ప్రకారం, Samsung Galaxy S24 Ultra డివైజ్ 256జిబి వేరియంట్ ధర 1449 యూరోలు (సుమారు రూ.1,31,745) ఉంటుంది.
- Samsung Galaxy S24 Ultra 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1569 యూరోలు (సుమారు రూ.1,42,655) ఉంటుంది.
- Samsung Galaxy S24 Ultra 1టిబి స్టోరేజీ మోడల్ ధర 1809 యూరోలు (సుమారు రూ.1,64,477) ఉంటుందని అంచనా.











