
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 11 Pro మరియు OPPO Reno 11 డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro ఫోన్ల యొక్క ఇండియా ధరలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్స్ ద్వారా సోషల్ మీడియాలో ఈ వివరాలు షేర్ అయ్యాయి. ఓసారి, ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.
OPPO Reno 11, OPPO Reno 11 Pro ఇండియా ధరలు (లీక్)
- OPPO Reno 11 సిరీస్ లోని డివైజెస్ ధరలను ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా వేదిక X ద్వారా షేర్ చేశారు.
- OPPO Reno 11 డివైజ్ రూ.28,000 ధరతో లాంచ్ అవుతుందని సమాచారం.
- టిప్‌స్టర్ ప్రకారం, OPPO Reno 11 Pro మోడల్ రూ.35,000 ధరతో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
- OPPO Reno 11 సిరీస్ వేవ్ గ్రీన్ మరియు రాక్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Exclusive ?
Oppo Reno 11 Indian variant.
Price ? around ₹28,000
They are comparing it with Vivo V29e and Samsung Galaxy A34Specifications of Indian variant
? 6.7" FHD+ OLED display
120Hz refresh rate
? MediaTek Dimensity 7050 ?
8200 on chinese variant
? Android 14
?… pic.twitter.com/kIcDzPsv8e— Abhishek Yadav (@yabhishekhd) January 4, 2024
OPPO Reno 11 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Oppo Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Oppo Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Oppo Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 పై పని చేస్తుంది.
- కెమెరా: Oppo Reno 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Oppo Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 డివైజ్ 162.36 మి.మీ పొడవు, 73.98 మి.మీ వెడల్పు, 7.62 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.
OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Oppo Reno 11 Pro లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే, 1240*2772 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Oppo Reno 11 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
- ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Oppo Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Oppo Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Oppo Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-700 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.











