Android 14 ఓఎస్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన OPPO Reno 11, 11 Pro

Highlights

  • చైనాలో లాంచైన OPPO Reno 11 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Reno 11, 11 Pro
  • 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చిన ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO చైనాలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. గత మోడల్ OPPO Reno 10 సిరీస్ కి ఇది సక్సెసర్ గా వచ్చింది. కొన్ని గుర్తించదగిన మార్పులతో OPPO Reno 11 సిరీస్ యూజర్ల ముందుకు వచ్చింది. OPPO Reno 11 సిరీస్ లో వచ్చిన రెండు ఫోన్లలో 50ఎంపి మెయిన్ కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఉన్నాయి. ఓసారి OPPO Reno 11, OPPO Reno 11 Pro డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 సిరీస్ ధర

  • OPPO Reno 11 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 3,499 (సుమారు రూ.41,100) గా ఉంది.
  • OPPO Reno 11 Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 3,799 (సుమారు రూ.45,100) గా ఉంది.
  • OPPO Reno 11 5G ధర 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 2,499 (సుమారు రూ.29,700) గా ఉంది.
  • OPPO Reno 11 5G 12జిబి ర్యామ్ + 512జిబి మోడల్ ధర RMB 2,999 (సుమారు రూ.35,300) గా ఉంది.

OPPO Reno 11 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2,412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11 5G డివైజ్ 8జిబి/256జిబి, 12జిబి/256జిబి, 12జిబి/512జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: OPPO Reno 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO Reno 11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Reno 11 5G లో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO Reno 11 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 11 Pro 5G లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11 Pro 5G లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ వాడారు.
  • ఓఎస్: OPPO Reno 11 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO Reno 11 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 32ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి 2ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 20ఎక్స్ డిజిటల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Reno 11 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.