
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు గ్లోబల్‌గా Reno 11F 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ థాయిలాండ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. OPPO Reno 11F 5G డివైజ్ 8జిబి ర్యామ్, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 64ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO Reno 11F 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
OPPO Reno 11F 5G ధర
- OPPO Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ థాయిలాండ్ మార్కెట్ లో సింగిల్ స్టోరేజీతో లాంచ్ అయ్యింది.
- OPPO Reno 11F 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను THB 10,990 (సుమారు రూ.25,500) గా నిర్ణయించారు.
- OPPO Reno 11F 5G డివైజ్ పామ్ గ్రీన్, ఓషన్ బ్లూ మరియు కోరల్ పర్పుల్ కలర్ ఆప్షన్స లో లభిస్తుంది. రానున్న రోజుల్లో OPPO Reno 11F 5G సేల్ మొదలుకానుంది.
OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Reno 11F 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 10-బిట్ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 100 పర్సెంట్ ఎస్ఆర్జీబీ కవరేజీ, 1.07 మిలియన్ కలర్స్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 93.4% స్క్రీన్ టు బాడీ రేషియో, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO Reno 11F 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ68 ఎంసీ4 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11F 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
- కెమెరా: OPPO Reno 11F 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒవి64బి ప్రైమరీ లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 సెన్సర్ ఉంది.
- బ్యాటరీ, చార్జింగ్: OPPO Reno 11F 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్: OPPO Reno 11F 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: OPPO Reno 11F 5G లో వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: OPPO Reno 11F 5G లో ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, జియోమ్యాగ్నెటిక్ సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాక్సలరేషన్ సెన్సర్, గ్రావిటీ సెన్సర్, జైరోస్కోప్, స్టెప్ కౌంటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: OPPO Reno 11F 5G డివైజ్ 161.1 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.54 మి.మీ మందం, 177 గ్రాముల బరువు ఉంటుంది.











