
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్‌ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలుత Vivo V30 చైనా మార్కెట్ లో ఇప్పటికే లాంచ్ అయ్యింది. ఇప్పుడు Vivo V30 Pro లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి Vivo V30 Pro బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo V30 Pro బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

- Vivo V30 Pro డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ డేటాబేస్ పై V2319 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Vivo V30 Pro డివైజ్ పేరు స్పష్టంగా లిస్టింగ్ పై పేర్కొనబడి ఉంది.
- బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా Vivo V30 Pro కి సంబంధించిన మరే ఇతర స్పెసిఫికేషన్స్ వెల్లడి కాలేదు. అయితే బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో డివైజ్ కనిపిస్తోంది.
- బ్లూటూత్ ఎస్ఐజీ ప్లాట్ఫామ్ పై Vivo V30 Pro కనిపించడంతో, త్వరలోనే లాంచ్ ఉంటుందని స్పష్టమవుతోంది.
- Vivo V30 Pro లాంచ్ ప్రకటన త్వరలోనే ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
Vivo V30 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo V30 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్సో కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Vivo V30 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటోఫోకస్ డ్యూయల్ సాఫ్ట్ ఎల్ఈడీ ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Vivo V30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo V30 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్ (ఎల్1+ఎల్5), యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Vivo V30 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ సర్టిఫికేషన్ ఉన్నాయి.











