
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె భారతీయ మార్కెట్ లో Reno 12 సిరీస్ లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో రెనో 12, 12 ప్రో ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు ఏఐ ఫీచర్లతో వచ్చాయి. టాప్ మోడల్ OPPO Reno 12 Pro సేల్ నేటి నుంచి భారత్ లో మొదలైంది. ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఓసారి OPPO Reno 12 Pro ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
OPPO Reno 12 Pro ధర, లభ్యత
OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.36,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.40,999 గా ఉంది.
OPPO Reno 12 Pro డివైజ్‌ని ఫ్లిప్‌కార్ట్, ఒప్పో వెబ్‌సైట్ మరియు లీడింగ్ రిటైల్ స్టోర్స్ ద్వారా నేటి నుంచి కొనుగోలు చేయవచ్చు. 12జిబి+256జిబి వేరియంట్‌పై రూ.3,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 12జిబి+512జిబి మోడల్ పై రూ.4,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్
OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎనర్జీ చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి-జీ615 జీపీయూ ఇచ్చారు.
OPPO Reno 12 Pro డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 12జిబి వర్చువల్ ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకునే వీలుంది.
OPPO Reno 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి.
OPPO Reno 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరా, 50ఎంపి శాంసంగ్ ఎస్5కేజెఎన్5 టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ ఓఐఎస్ మరియు 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో వచ్చింది.
సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ కెమెరాలో శాంసంగ్ ఎస్5కేజెఎన్5 సెన్సర్ వాడారు.
OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
OPPO Reno 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
OPPO Reno 12 Pro లో 360-డిగ్రీ డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీ, డ్యూయల్ 4కే అల్ట్రా-క్లియర్ వీడియో, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0, ఏఐ ఎరేజర్ 2.0, లింక్ బూస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.











