హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్
- 4జీ మరియు 5జీ వేరియంట్స్ లో రానున్న OPPO Reno 8T 5G
- 5జీ వేరియంట్ భారత్ లో OPPO F23 5G పేరుతో లాంచ్ అయ్యే అవకాశం
ఒప్పో కంపెనీ రీసెంట్ గా చైనాలో Reno 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అయితే ఇవి భారత్ లో లాంచ్ కాలేదు. అలాగే కాబోవని తాజాగా ఓ రిపోర్ట్ ద్వారా తెలిసింది. ఈలోపు OPPO Reno 8T డివైజ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఎంట్రీ ఇవ్వనుందని మరొక వార్త వచ్చింది. అయితే ఒప్పో నుంచి దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఏదీ రాలేదు. ఇదిలా ఉండగా, OPPO Reno 8T కి సంబంధించిన పలు వివరాలు రివీల్ అయ్యాయి.
ప్రముఖ టిప్ స్టర్ పారస్ గుగ్లాని OPPO Reno 8T 5G ఫోన్ భారత్ లో F23 సిరీస్ రూపంలో లాంచ్ కానుందని చెప్పాడు. OPPO Reno 8T యొక్క 5G వర్షన్ భారత్ లో OPPO F23 5G పేరుతో లాంచ్ కానుంది. గుగ్లాని షేర్ చేసిన ఇమేజ్ ద్వారా ఒ్పపో ఎఫ్23 5జీ యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. ఇప్పటి వరకు OPPO Reno 8T 5G అలియాస్ OPPO F23 5G గురించి తెలసిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.
OPPO F23 5G గా భారత్లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G
Oppo Reno 8T 5G Global / F23 5G [Alleged India]
– SD695
-67W pic.twitter.com/56DQtLbkJ1— Paras Guglani (@passionategeekz) January 7, 2023
OPPO Reno 8T 5G యొక్క లాంచ్ డేట్ ఇంకా తెలియలేదు. త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన రానుంది. ఈలోపు ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. గుగ్లాని ప్రకారం, OPPO Reno 8T 5G ఫోన్ భారత్ లో F23 5G పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
గుగ్లాని ఫోన్ యొక్క డిజైన్ కి సంబంధించిన ఇమేజ్ ని పోస్ట్ చేశాడు. దీంతో ఫోన్ యొక్క ఫ్రంట్ మరియు బ్యాక్ లుక్ బయటకు వచ్చింది. ఫోన్ ఫ్రంట్ నుంచి కర్వ్డ్ లుక్ తో ఉంది. ఇంకా హోల్-పంచ్ కటౌట్ టాప్ సెంటర్ లో ఉంది. ఇంకా బాటమ్ చిన్, టాప్ బెజెల్ సన్నగా ఉన్నాయి.
ఇకపోతే ఫోన్ ఎడమవైపున వాల్యూమ్ బటన్, కుడివైపున పవర్ బటన్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై గోల్డ్ కలర్ ఫినిషింగ్, పిల్-షేప్డ్ కటౌట్ కనిపిస్తున్నాయి. ఈ కటౌట్ లో రెండు సర్క్యులర్ కటౌట్స్ లో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. టాప్ కటౌట్ లో సింగిల్ లెన్స్, బాటమ్ కటౌట్ లో సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
OPPO Reno 8T యొక్క 4జీ వేరియంట్ ఇటీవలె గీక్ బెంచ్ పై కనిపించింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది. ఇక ఈ ఫోన్ కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












