లీకైన OPPO Reno 9 సిరీస్ డిజైన్ పిక్స్; రివీల్ అయిన కెమెరా మాడ్యూల్, కలర్ ఆప్షన్స్

హైలైట్స్

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న OPPO Reno 9 సిరీస్
  • ఈ లైనప్ లో ఉండే మోడల్స్: OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+
  • తాజాగా లీకైన OPPO Reno 9 సిరీస్ డిజైన్ రెండర్స్ ద్వారా రివీల్ అయిన కెమెరా మాడ్యూల్, కలర్ ఆప్షన్స్

OPPO Reno 9 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. త్వరలోనే ఒప్పో నుంచి OPPO Reno 9 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటన రానుంది. తొలుత ఈ డివైజెస్ చైనాలో లాంచ్ అవుతాయి. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తాయి. తాజాగా OPPO Reno 9 సిరీస్ యొక్క డిజైన్ రెండర్స్ బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ వీటిని లీక్ చేశాడు. లీక్స్ ద్వారా OPPO Reno 9 సిరీస్ ఫోన్ల యొక్క కెమెరా మాడ్యూల్స్, కలర్ ఆప్షన్స్ వివరాలు రివీల్ అయ్యాయి.

తాజాగా లీకైన డిజైన్ రెండర్స్ ద్వారా OPPO Reno 9 సిరీస్ కొన్ని డిజైన్ మార్పులతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి OPPO Reno 9 సిరీస్ డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

OPPO Reno 9 సిరీస్ డిజైన్ రెండర్స్

OPPO Reno 9 సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ ఆరంభంలో చైనాలో లాంచ్ కానుంది. OPPO Reno 9 సిరీస్ లో మూడు మోడల్స్ ఉంటాయి. వీటిలో చవకైనది స్టాండర్డ్ మోడల్ OPPO Reno 9. ఈ Reno 9 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెనో 8 మాదిరి కెమెరా మాడ్యూల్ ఇందులో లేదు. దానికి బదులుగా ఈ ఫోన్ రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ని కలిగి ఉంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్, డమ్మీ కటౌట్ ఉన్నాయి.

OPPO Reno 9 లో కర్వ్డ్ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్ ఉన్నాయి. కర్వ్డ్ ఫ్రేమ్ లో ఎడమ వైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. కుడివైపున పవర్ బటన్ ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంటాయి.

OPPO Reno 9 Pro లో డ్యూయల్ కెమెరా సెటప్, డ్యూయల్ టోన్ బ్యాక్ బాడీ ఉన్నాయి. శాంసంగ్ ఎస్22 వంటి కెమెరా మాడ్యూల్ డిజైన్ ఇందులో ఉంది. OPPO Reno 9 Pro రెండు రియర్ కెమెరాలు, డ్యూయల్ ఫ్లాష్ తో వస్తోంది. ఇందులో మారిసిలికాన్ ఎక్స్ ఎన్‌పీయూ ఉంది. ముందు వైపున హోల్-పంచ్ కటౌట్ ఉంది. స్క్రీన్ ఎడ్జెస్ కర్వ్ కాబడి ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఇందులో ఉంటాయి.

OPPO Reno 9 Pro+ 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఎస్21 అల్ట్రా మాదిరి కెమెరా మాడ్యూల్ ఇందులో ఉంది. ఫ్రేమ్ కర్వ్డ్ గా ఉంది. పవర్ బటన్ కుడివైపున ఉంది. ఎడమ వైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. పంచ్ హోల్ కటౌట్ తో కూడిన కర్వ్డ్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోంది. 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంటాయి. ఈ ఫోన్ లో 50 ఎంపి సోని ఐఎంఎక్స్890 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.

OPPO Reno 9 స్మార్ట్ ఫోన్ రోజ్ గోల్డ్ కలర్ లో వస్తోంది. OPPO Reno 9 Pro స్మార్ట్ ఫోన్ షిమ్మరీ గోల్డ్ కలర్ ఆప్షన్, OPPO Reno 9 Pro+ 5G గ్రీన్ కలర్ ఆప్షన్ లో వస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలీకైన Vivo Y02 స్పెసిఫికేషన్స్, ధర
Next articleBYD Atto 3 ఎలక్ట్రిక్ కారు ధరను రివీల్ చేసిన కంపెనీ
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.