హైలైట్స్:
- మంటలు చెలరేగినప్పుడు చార్జింగ్ లో లేని ఒప్పో రెనో2
- పేలుడుకి ముందు వస్తున్న పొగలను ఫోటో తీసి ట్వీట్ చేసిన యూజర్
- గతంలో ఎన్నోసార్లు వెలుగు చూసిన స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్ళ ఉదంతాలు
తాజాగా జరిగిన స్మార్ట్ ఫోన్ పేలుడు ఉదంతంలో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ లో లేదు. అలాగే హెవీగా వాడకం కూడా లేదు. వరుసగా యూజర్ పెట్టిన ట్వీట్స్ ని బట్టి, పేలిన ఫోన్ 2019 లో లాంచ్ అయిన ఒప్పో రెనో2 అని అర్థమవుతోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో 2022, జులై 6 న మంటలు చెలరేగాయి. తాను వాట్సాప్ వాడుతున్నప్పుడు, ఉన్నట్లుండి ఫోన్ నుంచి మంటలు వ్యాపించాయని, అప్పుడు ఫోన్ ఛార్జింగ్ లో కూడా లేదని, వంశీ అనే యూజర్ ట్వీట్స్ చేశాడు.
వివాదాస్పద ఫోన్ల జాబితాలో చేరిన OPPO Reno2
సదరు బాధితుడు ఒప్పో ఇండియా కస్టమర్ కేర్ తో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తో పాటు, ఫోన్ కి ఇమేజెస్ ని షేర్ చేశాడు. అయితే ఒప్పో ఇంత వరకు జరిగిన ఘటన పట్ల బాధ్యతను తీసుకోలేదని అతడు అన్నాడు.
This was really traumatising. I really want @OppoIndia to take action regarding this as soon as possible. Their customer support is literally of no use. They claim that this phone only has scratches and it didn't #blast or #burn.
— vamshi (@vamshi6421) July 6, 2022
“మీ డివైజ్ జెన్యూన్ గా కాలిపోలేదు, లేదా ఇంటర్నల్ గా పగిలిపోలేదు. కాబట్టి, మేము ఈ కేసుని బ్లాస్ట్ కేసుగా పరిగణించలేము. మరేదైనా ప్రశ్నలుంటే, మా సర్వీస్ సెంటర్ లో సంప్రదించగలరు,” అని ఒక స్టేట్మెంట్ లో ఒప్పో కేర్ ఇండియా స్పందించినట్లుగా ఉంది.
After this incident, I checked a lot of similar incidents reported. I want @oppo to recheck all the phones that was manufactured in that batch immediately.
Date & Time – 22nd June
Location – Indiranagar, Bengaluru
Battery Status – Not charging
Application in use – Whatsapp— vamshi (@vamshi6421) July 6, 2022
ఇప్పటి వరకు ఒప్పో ఇండియా జరిగిన ఘటనపై ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్, రెజుల్యూషన్ ను అందించలేదని, కేసు ఇంకా విచారణ నిమిత్తం ఓపెన్ గానే ఉన్నట్లు బాధితుడు తెలిపాడు.
స్మార్ట్ ఫోన్స్ నిప్పంటుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి ఫోన్ కూడా మంటలంటుకుంది. ఈ ఘటన ఇదే ఏడాది ఏప్రిల్ లో జరిగింది. చార్జింగ్ లో లేనప్పటికీ, ఫోన్ పేలిందని, ఘటనలో ఎవ్వరికి హాని జరగలేదని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక గతంలో వన్ ప్లస్ నార్డ్ 2 డివైజ్ ఎక్కువగా వేడెక్కడం, పేలడం వంటి ఉదంతాలు భారత్ లో వెలుగు చూశాయి. అప్పుడు ఘటనపై స్పందించిన వన్ ప్లస్ యాజమాన్యం, బాధితులకు కొత్త ఫోన్ తో పాటు, మెడికల్ కంపెన్సేషన్ ను అందించాయి. మరి తాజా ఘటన నేపథ్యంలో, ఒప్పో కూడా ఇదే విధంగా స్పందిస్తుందో లేదో చూడాలి. సరైన రీతిలో స్పందించకపోతే, ఒప్పో కంపెనీ యూజర్లలో వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఖాయం.
ఇక ఒప్పో రెనో2 గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 2019, ఆగస్టులో లాంచ్ అయ్యింది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 730జి ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 48ఎంపి క్వాడ్ రియర్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు రెనో2 లో ఉన్నాయి.