Home News లీకైన OPPO రోలబుల్ ఫోన్ డిజైన్ పేటెంట్, ఇన్విజిబుల్ కెమెరాతో రానున్న డివైజ్

లీకైన OPPO రోలబుల్ ఫోన్ డిజైన్ పేటెంట్, ఇన్విజిబుల్ కెమెరాతో రానున్న డివైజ్

Highlights
  • రీసెంట్ గా Find N2, Find N2 Flip ఫోన్లను లాంచ్ చేసిన ఒప్పో
  • త్వరలోనే రోలబుల్ ఫోన్ లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోన్న కంపెనీ
  • తాజాగా లీకైన రోలబుల్ ఫోన్ పేటెంట్, ఇన్విజిబుల్ కెమెరానే హైలైట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో Find N2, Find N2 Flip డివైజెస్ ని లాంచ్ చేసింది. అంతేకాదు, త్వరలోనే తన రోలబుల్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఒప్పో రోలబుల్ ఫోన్ చైనీస్ పేటెంట్ సైట్ CNIPA పైన లిస్ట్ అయ్యింది.

OPPO Rollable Phone డిజైన్

ఒప్పో రోలబుల్ ఫోన్ డిజైన్ గురించి మాట్లాడితే, చూడటానికి సింపుల్ బార్ ఫోన్ గా కనిపిస్తోంది. అలాగే, బ్యాక్ ప్యానెల్ పై రియర్ కెమెరా కూడా కనిపించడం లేదు. ఫోన్ రోల్ అయినప్పుడు ట్రిపుల్ రియర్ కెమెరా బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తోంది. ఇంకా ఫోన్ డిస్ప్లే కూడా పెద్దగా అవుతోంది. ముందు నుంచి స్క్రీన్ తో సహా ఫోన్ చూడటానికి చాలా పెద్దగా కనిపిస్తోంది. కెమెరా కూడా కవర్ లో ఉంది.

మరోవైపు ముందు వైపు చూస్తే, కెమెరా సెన్సర్ స్క్రీన్ పై ఎక్కడా కనిపించడం లేదు. అంటే దీనర్థం, ఇన్విజిబుల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తుందని మనం అంచనా వేయవచ్చు.

ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై చూస్తే, ఈ డివైజ్ రెండు వైపుల నుంచి రోల్ అవుతుందని తెలుస్తోంది. అలాగే స్క్రీన్ కూడా రెండు వైపుల నుంచి పెద్దగా అవుతోంది. డిజైన్ లో చెప్పుకోదగిన విషయం ఏంటంటే, బ్యాక్ ప్యానెల్ రెండు వైపుల నుంచి డైరెక్ట్ గా సెపరేట్ అవ్వడం లేదు. దానికి బదులుగా, కంపెనీ కొత్త స్టైల్ ని పరిచయం చేసింది. అది ఈ ఫోన్ ని యూనిక్ గా నిలబెడుతోంది.

పోర్ట్స్ మరియు హార్డ్‌వేర్ బటన్స్ ని గమనిస్తే, వాల్యూమ్ రాకర్, పవర్ బటన్స్ రైట్ సైడ్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి. బాటమ్ లో లౌడ్ స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

OPPO Rollable Phone

ఒప్పో రోలబుల్ ఫోన్ చైనా సర్టిఫికేషన్ సైట్ చైనా నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ (CNIPA) పై లిస్ట్ అయ్యింది. అయితే పేటెంట్ 2021 డిసెంబర్ లోనే ఫైల్ అయినప్పటికీ, ఏప్రిల్ 14 న అప్రూవ్ అయ్యింది. ఇప్పుడు కంపెనీ తన డిజైన్ ని అభివృద్ధి చేయనుంది. పేటెంట్ డ్రాయింగ్ ని బట్టి ఇది కచ్చితంగా మొబైల్ ఫోన్ అని తెలుస్తోంది. ఒక ఒప్పో తన దృష్టిని ఫోన్ డిజైన్ పై పెట్టనుంది.

Source: 91mobiles Hindi

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.