Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO C61 అనే స్మార్ట్ఫోన్ లాంచ్ కానుంది. గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా, బ్లూటూత్ ఎస్ఐజీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్ పై POCO C61 పై లిస్ట్ అయ్యింది. బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా POCO C61 ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ, బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.
POCO C61 బ్లూటూత్ ఎస్ఐజీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్
- బ్లూటూత్ ఎస్ఐజీ పై POCO C61 డివైజ్ 2312BPC51H మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- బ్లూటూత్ ఎస్ఐజీ ద్వారా డివైజ్ పేరు POCO C61 గా కన్ఫర్మ్ అయ్యింది. రెడ్మీ ఏ3 కి రీబ్రాండ్ వర్షన్ గా POCO C61 లాంచ్ కానుందని సమాచారం. ఇటీవలె భారత్ లో Redmi A3 లాంచ్ అయ్యింది.
- బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ మరియు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ కన్ఫర్మ్ అయ్యాయి.
- బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై 2312BPC51H అనే మోడల్ నంబర్ తో POCO C61 లిస్ట్ అయ్యింది.
Redmi A3 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi A3 లో 6.71-ఇంచ్ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ ఉంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 3జిబి/4జిబి/6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
- ఓఎస్: Redmi A3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో వర్షన్) ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Redmi A3 లో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ + గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
