ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గతేడాది డిసెంబర్ నెలలో తన సీ-సిరీస్ ఫోన్ POCO C65 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ కస్టమర్ల కోసం తక్కువ ధరలో ఈ ఫోన్ విడుదలైంది. తాజాగా ఈ ఫోన్ పై రియల్మీ సంస్థ ఆఫర్ ప్రకటించింది. రూ.1,501 వరకు ఈ ఫోన్ పై డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందామా?
POCO C65 డిస్కౌంట్ ఆఫర్ వివరాలు
POCO C65 స్మార్ట్‌ఫోన్‌ని ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్స్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లపై కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ ఆఫర్ వివరాలను చూస్తే, POCO C65 పై 36 శాతం అనగా, రూ.1,501 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ కేవలం రూ.6,998 కే లభించనుంది.
4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ తో రూ.8,499 ధరతో POCO C65 లాంచ్ అయ్యింది.
డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అమెజాన్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
POCO C65 ఇంకా 6జిబి+128 మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో కూడా లభిస్తుంది. వీటి ధరలను వరుసగా రూ.7,499 మరియు రూ.10,998 గా ఉన్నాయి.
POCO C65 ఫోన్ ఫ్లిప్‌కార్ట్ పై కూడా కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇక్కడ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది.
ఈ ఫోన్ కొనుగోలుపై, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో పాటు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.
POCO C65 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: POCO C65 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్నాయి.
ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: POCO C65 లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
ఓఎస్: POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: POCO C65 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
కనెక్టివిటీ: POCO C65 లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
సెక్యూరిటీ: POCO C65 లో భ్రదత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
