హైలైట్స్
- జనవరి 5 నుంచి జనవరి 8 మధ్యలో సీఈఎస్ 2023 లో లాంచ్ కానున్న Motorola ThinkPhone
- ప్రొడక్టివిటీ-ఫోకస్డ్ ఫీచర్స్ తో రానున్న Motorola ThinkPhone స్మార్ట్ ఫోన్
- టీజర్ ఇమేజ్ ని రివీల్ చేసిన మోటోరోలా, టెక్షర్డ్ డిజైన్ తో వస్తోన్న రియర్ ప్యానెల్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా అధికారికంగా తన సరికొత్త బిజినెస్ గ్రేడ్ స్మార్ట్ ఫోన్ Motorola ThinkPhone ని టీజ్ చేసింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2023 లో మోటోరోలా సంస్థ Motorola ThinkPhone ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అంటే జనవరి 5 నుంచి జనవరి 8 మధ్య ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.
Motorola ThinkPhone యొక్క రియర్ ప్యానెల్ డిజైన్ ని మోటోరోలా రివీల్ చేసింది. టెక్షర్డ్ బ్యాక్ ప్యానెల్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు స్పష్టమైంది. కంపెనీ ఇంకా ఫోన్ కి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. అయితే Motorola ThinkPhone ఫ్లాట్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ కి బాటమ్ లో ThinkPhone by Motorola అని రాసి ఉంది.
CES 2023 లో లాంచ్ కానున్న Motorola ThinkPhone
సీఈఎస్ 2023 ఈవెంట్ లో మోటోరోలా తన తొలి థింక్ ఫోన్ సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Motorola ThinkPhone ప్రొడక్టివిటీ-ఫోకస్డ్ ఫీచర్స్ తో రానున్నట్లు అంచనా. ఒక్క రియర్ ప్యానెల్ డిజైన్ ని తప్పా మిగతా ఏ వివరాలను కూడా కంపెనీ కన్ఫర్మ్ చేయలేదు.
అయితే రూమర్ రాయుళ్ళ ద్వారా ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలిసాయి. లీకైన మార్కెటింగ్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ ల్యాప్ టాప్ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలిసింది. యూజర్లు తమ ఫోన్ ని ల్యాప్ టాప్ కి కనెక్ట్ చేసుకుని వైర్లెస్ గా వాడుకోవచ్చు. కనెక్ట్ డిస్ప్లే, మిర్రర్ ఫోన్, వెబ్ క్యామ్ తదితర ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోందని తెలుస్తోంది. థింక్ ఫోన్ యూజర్లు తమ ల్యాప్ టాప్ ద్వారా ఇన్ కమింగ్ కాల్స్ మాట్లాడవచ్చు. ఇంకా మెసేజెస్ చెక్ చేయవచ్చు. అలాగే మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ చేయవచ్చు.
Motorola ThinkPhone 6.6-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ కటౌట్ తో వస్తోంది. ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
Motorola ThinkPhone లో 50ఎంపి మెయిన్ కెమెరా, 13 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ని వాడినట్లు సమాచారం. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ వస్తోంది.
Motorola ThinkPhone లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Motorola ThinkPhone ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
Motorola ThinkPhone 158.7 మిల్లీ మీటర్ల పొడవు, 74.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.3 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందా? లేదా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













