చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO కొన్ని రోజుల క్రితం పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ POCO F6 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ లో మంచి యూజర్ రేటింగ్ ఉంది. ఈ సమయంలో, ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ ని కంపెనీ ప్రకటించింది. శక్తివంతమైన ఈ ఫోన్‌ని సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు మంచి అవకాశం దొరికినట్లయ్యింది. ఓసారి ఆఫర్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.
POCO F6 5G ఆఫర్లు, ధర వివరాలు
POCO F6 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.2,000 డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యింది. లేటెస్ట్ ఆఫర్ తో, పోకో ఎఫ్6 ఫోన్ యొక్క 8జిబి+256జిబి బేస్ వేరియంట్ రూ.27,999 కి లభిస్తోంది. మిడ్ వేరియంట్ 12జిబి+256జిబి రూ.29,999 కి లభించనుంది. 12జిబి+512జిబి టాప్ వేరియంట్‌ని రూ.31,999 కే సొంతం చేసుకోవచ్చు.
ఈ మూడు మోడల్స్ రూ.29,999, రూ.31,999 మరియు రూ.33,999 ధరలతో లాంచ్ అయ్యాయి.
ఇక డిస్కౌంట్ ఆఫర్ తో పాటు, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
POCO F6 5G స్మార్ట్‌ఫోన్ బ్లాక్ మరియు టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
POCO F6 5G ఫోన్‌ని మీరు కొంటే లాభమేనా?
POCO F6 5G డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 1.5కే అమోలెడ్ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఉత్తమమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేగాక, ఈ ఫోన్ 2024 మే నెలలోనే లాంచ్ అయ్యింది. కాబట్టి, మీకు ఈ ఫోన్ సరైన ఎంపికేనని చెప్పవచ్చు.
POCO F6 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: POCO F6 లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ టెక్నాలజీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
ప్రాసెసర్: POCO F6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వినియోగించారు.
కెమెరా: POCO F6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: POCO F6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
కనెక్టివిటీ: POCO F6 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
