
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO తాజాగా ఎఫ్6 సిరీస్ లో కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. POCO F6 Deadpool పేరుతో వచ్చిన ఈ ప్రత్యేక ఎడిషన్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. బ్యాక్ ప్యానెల్ పై డెడ్‌పూల్ అండ్ వొల్వరిన్ డిజైన్ అందించారు. ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రత్యేకించి భారతీయ మార్కెట్ కోసం తీసుకొచ్చారు. సరే, ఓసారి POCO F6 డెడ్‌పూల్ ఎడిషన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
POCO F6 Deadpool Edition ధర మరియు లభ్యత
POCO F6 Deadpool Edition ధరను భారతీయ మార్కెట్ లో రూ.33,999 గా నిర్ణయించారు. ఇది 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని కలిగి ఉంది. ఆగస్టు 7వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత POCO F6 Deadpool Edition ను రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు.
POCO F6 Deadpool Edition ఫీచర్లు
POCO F6 Deadpool Edition రెడ్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చింది. డెడ్‌పూల్ మరియు వొల్వరిన్ లుక ఈ ఫోన్ కి ఇచ్చారు. కెమెరాకి దగ్గరలో ఉన్న ఎల్ఈడీ ఫ్లాష్ రింగ్‌ను డెడ్‌పూల్ కళ్ళ మాదిరి చూపించారు. ఎడ్జెస్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఓవరాల్ గా ఫోన్ రెడ్-బ్లాక్ థీమ్ తో ఉంది. బాక్స్ లో అందించే చార్జర్ పై డెడ్‌పూల్ లోగో ఉంది. ఇక సిమ్ ఎజెక్టర్ షేప్ డెడ్‌పూల్ మాస్క్ మాదిరి ఉంది.
POCO F6 Deadpool Edition స్పెసిఫికేషన్స్
POCO F6 Deadpool Edition స్పెసిఫికేషన్స్ స్టాండర్డ్ ఎడిషన్ లో మాదిరే ఉంటాయి. కేవలం ప్యానెల్ డిజైన్, కలర్ కాంబినేషన్ లో మాత్రమే మార్పు కనిపిస్తుంది.
డిస్ప్లే: POCO F6 Deadpool Edition లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
ప్రాసెసర్: POCO F6 Deadpool Edition స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3 గిగాహెర్ట్జ్.
కెమెరా: POCO F6 Deadpool Edition డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: POCO F6 Deadpool Edition లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: POCO F6 Deadpool Edition లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: POCO F6 Deadpool Edition లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐపీ64 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











