Vivo Y18i: రూ.7,999 ధరతో భారత్‌లో లాంచైన వివో వై18ఐ

Highlights

  • భారత్‌లో Vivo Y18i లాంచ్
  • డివైజ్ ధర రూ.7,999
  • ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y18i పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్ రూ.7,999 కే అందుబాటులోకి వచ్చిందని 91mobiles కి ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందినది. మరి, వివో వై18ఐ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?

Vivo Y18i ధర, లభ్యత

Vivo Y18i స్మార్ట్‌ఫోన్ భారతీయ ఆఫ్‌లైన్ మార్కెట్ లో సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అయ్యింది. అతి త్వరలో ఈ ఫోన్ ఆన్‌లైన్ మార్కెట్ లో కూడా లభించనుందని సమాచారం.

Vivo Y18i యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.7,999 గా నిర్ణయించారు.

Vivo Y18i స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y18i స్మార్ట్‌ఫోన్‌లో 6.56-ఇంచ్ భారీ హెచ్డీ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 528 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y18i డివైజ్‌లో యూనిఎస్ఓసీ టైగర్ టీ612 చిప్సెట్ వాడారు.

సాఫ్ట్‌వేర్: Vivo Y18i డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y18i డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంలో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Vivo Y18i లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 0.08ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y18i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y18i లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Previous articlePOCO F6 Deadpool Edition: భారత్‌లో లాంచైన ఎఫ్6 డెడ్ పూల్ ఎడిషన్
Next articleFastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024)
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.