
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO, టెలీకామ్ సంస్థ Airtel తో కలిసి నేడు భారతీయ మార్కెట్ లో POCO M6 5G ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ వేరియంట్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ తో లాక్ అయ్యి ఉంటుంది. అంటే కస్టమర్ కేవలం ఎయిర్టెల్ సిమ్ ని మాత్రమే ఈ ఫోన్ లో ఉపయోగించే అవకావం ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. POCO M6 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే తో వచ్చింది. సరే, ఓసారి POCO M6 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
POCO M6 5G Airtel Exclusive ధర, లభ్యత
POCO M6 5G Airtel Exclusive 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. దీని ధర వివరాలు తెలుసుకుందాం.
POCO M6 5G Airtel Exclusive 4జిబి+128జిబి మోడల్ ధరను రూ.8,799 గా నిర్ణయించారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌ని మార్చి 10వ తేదీ నుంచి Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు.
POCO M6 5G Airtel Exclusive కొనుగోలుపై అదనంగా రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ హ్యాండ్సెట్ కొనే కస్టమర్లు ఎయిర్టెల్ కనెక్షన్ వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.199 లేదా అంతకంటే పైన అపరిమిత ప్లాన్స్ ని 18 నెలల పాటు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే బెనిఫిట్ లభిస్తుంది.
POCO M6 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
- డిస్ప్లే: POCO M6 5G లో 6.74-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (1650*720) రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
- ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 8జిబి వరకు వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- సాఫ్ట్వేర్: POCO M6 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: POCO M6 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: POCO M6 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: POCO M6 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
- కలర్ ఆప్షన్స్: POCO M6 5G డివైజ్ ఒరైన్ బ్లూ, పొలారిస్ గ్రీన్ మరియు గెలాక్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బరువు, చుట్టుకొలత: POCO M6 5G 168మి.మీ పొడవు, 78 మి.మీ వెడల్పు, 8.19 మి.మీ మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది.












