Home News POCO M6 Plus 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన ఎమ్6 ప్లస్ 5జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి

POCO M6 Plus 5G: గీక్‌బెంచ్‌పై లిస్టైన ఎమ్6 ప్లస్ 5జీ, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights
  • త్వరలో POCO M6 Plus 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ 24066PC95I
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

POCO M6 Plus 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

POCO M6 Plus 5G డివైజ్ గీక్‌బెంచ్‌పై 24066PC95I అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 967 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2281 పాయింట్ల స్కోర్ నమోదు చేసింది.

2.3 గిగాహెర్ట్జ్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్, అడ్రెనో 613 జీపీయూ గ్రాఫిక్స్ తో POCO M6 Plus 5G డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ లో ఉన్న వివరాలను బట్టి, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ తో వచ్చే అవకాశం ఉంది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉంటాయని చెప్పవచ్చు.

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి తెలిసిన సమాచారం ఇంతే. త్వరలోనే మరిన్ని వివరాల తెలిసే అవకాశం ఉంది.

POCO M6 Plus 5G డివైజ్ చైనాలో ఇప్పటికే లాంచైన Redmi Note 13R కి రీబ్రాండ్ వర్షన్‌గా మార్కెట్ లోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఓసారి రెడ్మీ నోట్ 13ఆర్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi Note 13R స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Redmi Note 13R 5G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2460*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 13R 5G డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3GHz.

మెమొరీ: Redmi Note 13R 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Redmi Note 13R 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi Note 13R 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi Note 13R 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.